Old Pension Scheme: ఉద్యోగులకు షాక్.. కొత్తపెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌కు మారడానికి ఇక నో ఛాన్స్..

Old Pension: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి ,ఉద్యోగులకు కేంద్రం భారీ షాక్‌ ఇచ్చింది. కొత్త పెన్షన్‌ విధానం నుంచి పాత పెన్షన్‌ విధానానికి ఇక గడువు పొడిగించే అవకాశం లేదని చెప్పింది. 

1 /5

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ పద్ధతివైపే మొగ్గు చూపుతున్నారానే విషయం తెలిసిందే. దీనికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగికరించాయి. అయితే, ఇలా కొత్త పద్ధతి నుంచి పాత పెన్షన్‌ విధానానికి గడువు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చాలామంది ఎదురు చూశారు. కానీ, కేంద్రం నుంచి ఒక అప్డేట్‌ వచ్చింది. ఇక గడువు పెంచే సమయం లేదు.  

2 /5

చాలా వరకు వార్త పత్రికలు ప్రభుత్వం కొత్త పద్ధతి నుంచి కొత్త పద్ధతికి మారడానికి సమయం పెంచుతుందని చెప్పాయి. దీంతో ఉద్యోగులు కూడా ఆశలు పెంచుకున్నారు. 2003 లో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ స్కీమ్‌ను ప్రారంభించింది.   

3 /5

సాయుధ బలగాలకు మినహా మిగతా అందరు ఉద్యోగులకు కొత్త పెన్షన విధానం తప్పనిసరి అని కేంద్ర సహాయ మంత్రి కూడా చెప్పారు. అయితే, 2003 డిసెంబర్‌కు మందు చేరిన ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానానికి అవకాశం ఇచ్చారు.  

4 /5

ఉద్యోగులకు ఎంచుకున్న విధానానికి సమయం తీసుకుని మరి పరిశీలించారు. అయితే, అర్హులైన ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు పొందడానికి మరింత సమయం పొడిగించాలని  ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కానీ, ఆ అవకాశం లేదని కేంద్ర చెప్పేసింది  

5 /5

2023 లో కొత్త నుంచి పాత పెన్షన్‌ విధానంలోకి మారేందుకు ఛాన్స్‌ ఇచ్చారు. అయితే, ఈ అవకాశం 2023 నవంబర్‌ వరకు సమయం ఇచ్చారు. లోక్‌సభలో కేంద్ర సహాయ మంత్రిని అడిగన ప్రశ్నకు ఆయన 2004 జనవరి 1 తర్వాత చేరిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎన్‌పీఎస్‌ తప్పనిసరి అని చెప్పారు.