Earthquak in Delhi NCR: ఢిల్లీ-ఎన్‌సీఆర్ రీజియన్ లో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై (Richter Scale) భూకంప తీవ్రత 6.7గా నమోదైంది. ఈరోజు ఉదయం 9.56 గంటలకు భూకంపం  (Earthquake) సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో భయాందోళన చెందిన ప్రజలు...ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అదే విధంగా జమ్మూకశ్మీర్‌, నోయిడా సహా ఇతర ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి. అంతకుముందు ఉత్తరాఖండ్​లోని ఉత్తరకాశీలో కూడా 3.6 తీవ్రతతో భూమి కంపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో.. ఈ ఉదయం జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ మరియు సమీప నగరాల్లో భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఉదయం 9.45 గంటల ప్రాంతంలో భూమి కంపించినట్లు నేషనల్​ సెంటర్​ ఫర్​ సిస్మాలజీ వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని కొంతమంది నివాసితులు కనీసం 20 సెకన్ల పాటు భూమి కంపించిందని ట్వీట్ చేశారు. ఢిల్లీలోని ప్రజలు కూడా ప్రకంపనలు వచ్చినట్లు ట్వీట్ చేశారు. ఆస్తి, ప్రాణనష్టం గురించి వివరాలు తెలియాల్సి ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook