NEET 2021 విద్యార్ధుల్లో అసహనం పెరుగుతోంది. నీట్ ఫలితాల వెల్లడిలో జరుగుతున్న ఆలస్యంపై విద్యార్ధుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్ ఫలితాల వెల్లడిలో జాప్యం ఎందుకు జరుగుతుందో పరిశీలిద్దాం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నీట్ 2021 పరీక్ష(NEET 2021)ముగిసి నెలన్నర ముగిసింది. ఇంకా ఫలితాలు మాత్రం వెల్లడి కాలేదు. ఈ వ్యవహారంపై అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సెప్టెంబర్ 12వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహించింది. ప్రతిసారీ నెలరోజుల్లోనే ఫలితాలు వెల్లడవుతుంటాయి. ఈసారి మాత్రం తీవ్ర జాప్యం చోటుచేసుకుంది. క్వశ్చన్ పేపర్ తారుమారైందనే కారణంతో ఇద్దరు విద్యార్ధులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని ముంబై హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ ఇద్దరికి పరీక్ష నిర్వహించిన తరువాత ఫలితాలు వెల్లడించాలంటే ఆలస్యమౌతుందని ఎన్‌టీఏ కోర్టుకు విన్నవించింది. ముంబై హైకోర్టు(Mumbai High Court) తీర్పుపై స్టే విధిస్తే ఫలితాలు వెల్లడిస్తామని..నీట్ ఫలితాలు సిద్ఘంగా ఉన్నాయని తెలిపింది.


దాంతో సుప్రీంకోర్టు(Supreme Court) స్పందించింది. ఆ ఇద్దరి సంగతి తరువాత చూద్దామని..ముందు ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఆదేశాలిచ్చి ఐదు రోజులవుతోంది. సుప్రీంకోర్టు తీర్పు నేపధ్యంలో నీట్ ఫలితాలు విడుదల కానున్నాయని విద్యార్ధులు ఎదురుచూశారు. ఫలితాలు విడుదల కాలేదు సరికదా ఎప్పుడు విడుదల చేస్తారో కూడా చెప్పలని పరిస్థితిలో ఎన్‌టీఏ ఉంది. ఎన్‌టీఏ వైఖరిపై విద్యార్ధులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. ఎన్‌టీఏ వైఖరిని విమర్శిస్తూ ట్విట్టర్ వేదికగా ట్రోలింగ్ ప్రారంభించారు. నీట్ ఫలితాల(NEET 2021 Results)కోసం పలు రాష్ట్రాల్లో అడ్మిషన్లు కూడా నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా మెడికల్, డెంటల్, ఆయుష్ విభాగాల్లో ప్రవేశాలకై జరిగిన పరీక్షకు దాదాపు 16 లక్షలమంది హాజరయ్యారు.


Also read: National Media Awards 2021: జాతీయ మీడియా అవార్డుల ఎంట్రీలకు ఆహ్వానం, అర్హత వివరాలివే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి