Two Exams For 10th, 12th Students: కొత్త జాతీయ విద్యా విధానం తీసుకువచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో భారీ మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బోర్డు పరీక్షల విషయంలో కూడా మార్పులు చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఏడాదికి ఒక బోర్డు పరీక్ష కాకుండా రెండు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో భయం పోగొట్టడం, మంచి ప్రతిభ కనబర్చడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Aadhaar Update: గుడ్‌న్యూస్‌.. ఆధార్‌ అప్డేట్‌ కోసం ప్రత్యేక కేంద్రాలు.. ఎక్కడ అంటే..?


ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్‌లో పీఎం శ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) అనే పథకాన్ని మంగళవారం కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బోర్డు పరీక్షల విషయమై ప్రస్తావించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలకు విద్యార్థులు రెండు సార్లు హాజరయ్యేందుకు అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా విద్యార్థులు ఉత్తమ స్కోర్‌ను ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానం అమల్లోకి తెస్తామని వెల్లడించారు. 2020లో తీసుకువచ్చిన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ-2020)లో విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడం ఒక లక్ష్యమని గుర్తుచేశారు. ఈ లక్ష్యంలో భాగంగా విద్యార్థులు రెండుసార్లు బోర్డు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించేందుకు నిర్ణయించినట్లు వివరించారు.

Also Read: Belgrade Airport: 'పెద్ద రంధ్రం'తోనే గాల్లో ఎగిరిన విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణికులు


గతేడాది విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించిన కొత్త కరికులం ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌) ప్రకారం విద్యార్థులు మంచి పనితీరు కనబరిచేందుకు తగినంత సమయం ఇవ్వడానికి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. విద్యార్థులపై ఒత్తిడి లేకుండా ఉంచడం, నాణ్యమైన విద్యతో వారిలో మార్పు తీసుకురావడం, విద్యార్థులను సంస్కృతితో మమేకం చేయడం, భవిష్యత్‌ కోసం వారిని తీర్చిదిద్దడం వంటివి జాతీయ విద్యా విధానం లక్ష్యాలుగా వివరించారు. విద్యార్థులకు ఒత్తిడికి దూరం చేసి నాణ్యమైన విద్యను అందించడమే మోదీ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని 2047 నాటికి వికసిత్‌ భారత్‌గా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.


రెండు పరీక్షల లక్ష్యం ఏమిటి?
ఏడాదికి రెండు బోర్డు పరీక్షల లక్ష్యమేమిటని అందరిలో మెదలుతున్న ప్రశ్న. రెండు పరీక్షలతో విద్యార్థులు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. విద్యలో మంచి ప్రతిభ కనబర్చేందుకు వీలుంటుందని కేంద్ర విద్యా శాఖ పేర్కొంటోంది. ఏడాదిలో ఒక పరీక్ష వలన విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నట్లు గుర్తించింది. ఆ పరీక్షల్లో సరైన ఫలితాలు రాక బలవన్మరణాలకు కూడా పాల్పడుతున్నారు. వీటి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook