Sucharita mohanty puri congress candidate ls seat withdraws candidature: ఎన్నికలు దగ్గరపడుతున్న కొలది కాంగ్రెస్ కు ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురౌతున్నాయి.  ఒడిశా నుంచి ఎన్నికల బరిలో నిలబడిన పూరీ ఎంపీ అభ్యర్థి సుచరిత మొహంతీ  ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తనకు ఎన్నికలలో ఖర్చుచేయడానికి పార్టీ ఎలాంటి ఫండింగ్ చేయలేదని ఆమె వాపోయింది. దీనిపై పలుమార్లు కాంగ్రెస్ ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ కు లేఖలు రాసినట్లు తెలిపారు. అంతేకాకుండా.. తననే డబ్బులు పెట్టుకొమ్మంటున్నారని, కానీ తనకు అంతస్థోమత లేదని కూడా సుచరిత మొహంతి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా, ఎంపీ ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More:Nomination On Buffallo: అట్లుంటదీ మరీ.. బర్రెమీద ఊరేగింపుగా వచ్చి నామినేషన్.. వైరల్ గా మారిన వీడియో..


తన ఎంపీ టికెట్ ను వెనక్కు ఇస్తున్నట్లు వెల్లడించింది. తాను ఒక జర్నలిస్టునని, పదేళ్ల  క్రితం రాజకీయాల్లోకి వచ్చానని, క్రౌడ్ ఫండింగ్ కూడా చేశానని, కానీ తగిన డబ్బులు కూడా రాలేదంటూ కూడా ఆమె వెల్లడించింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


ఇదిలా ఉండగా.. పూరీలో ఆరోవిడతలో భాగంగా.. మే 25 న పోలింగ్ జరగనుంది. నామినేషన్ లు దాఖలుచేయడానికి మే 6 న లాస్ట్ డే. అయితే రెండు రోజుల ముందు ఈ విధంగా.. సుచరిత తన నామినేషన్ ను వెనక్కు ఇచ్చేయడం పట్ల కాంగ్రెస్ హైకమాండ్ కూడా  సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక పూరీలో బీజేపీ తరపున సాంబిత్ పాత్ర, బిజు జనతా దళ్ నుంచి అరూప్ పట్నాయక్ లు బరిలో నిలబడిన విషయం తెలిసిందే. ఇక దేశంలో ప్రస్తుతం బీజేపీ మరోమారు తమను గెలిపించి హ్యాట్రిక్ సాధించేలా చేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తమకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ప్రచారం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు ఒకరిపై మరోకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు గుప్పించుకుంటున్నాయి. 


Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..


దేశంలో బీజేపీ రాముడి పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతుందని, కాంగ్రెస్ ఎద్దెవా చేసింది. దేశంలో పదేళ్లలో దేశానికి చేసిన మంచి ఏంలేదంటూ కూడా కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈసారి ఇండియా కూటమిని భారీ మెజార్టీతో గెలిపించాలనికూడా కాంగ్రెస్ నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. కాంగ్రెస్ పాలనలో దేశం పూర్తిగా వెనక్కు వెళ్లిపోయిందని, మోదీ పాలనలో దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా తల ఎత్తుకుని నిలబడే పరిస్థితికి  చేరిందన్నారు. 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter