సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై చాలా ఏళ్లుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు ఆయన ఇప్పటికీ కసరత్తు చేస్తూనే ఉన్నారు.  ఆయన రాక కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. గతంలో రజినీ మక్కల్ మండ్రుం పేరుతో అభిమాన సంస్థ ఏర్పాటు చేసి ఫ్యాన్స్ ను ఆయన కలిశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐతే సూపర్ స్టార్ రజినీ కాంత్ నుంచి  రాజకీయ పార్టీ ప్రకటన మాత్రం ఇప్పటి వరకు వెలువడలేదు. రాజకీయ పార్టీ పేరు గురించి ఆయన ఎక్కడా ప్రస్తావించడం లేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఆయన రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. ఈ లోగా తమిళదర్శకుడు సుందర్ రాజన్  తలైవా రాజకీయ ఆరంగేట్రంపై సంచలన కామెంట్స్ కు తెరతీశారు. రజినీ కాంత్ పార్టీ పెట్టి . . కోయంబత్తూర్ లో భారీ బహిరంగ ఏర్పాటు చేసేలోపే చచ్చిపోరంటూ కామెంట్స్ చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 72వ జయంతి వేడుకకు హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. అందరూ ఎంజీఆర్ లా ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. ప్రస్తుతం రజినీకాంత్ ఆరోగ్యం ఏం బాగా లేదని తెలిపారు. అంతే కాదు .. సినీ పరిశ్రమకు చెందిన వారంతా అర్హతతో సంబంధం లేకుండా సీఎం కుర్చీ కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. 


Read Also: మిస్టర్ అండ్ మిస్ ట్రెయిలర్ విడుదల


మరోవైపు సుందర్ రాజన్ కామెంట్స్ పై సూపర్ స్టార్ రజనీకాంత్  ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని..లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.