ప్రముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త, చిప్కో ఉద్యమ‌కారుడు సుంద‌ర్‌లాల్ బ‌హుగుణ(94) క‌న్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన గత కొన్ని రోజులుగా  రిషికేశ్‌లోని ఎయిమ్స్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడం, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో నేటి (మే 21న) మ‌ధ్యాహ్నం 12.05 నిమిషాల‌కు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఎయిమ్స్ డైర‌క్టర్ ర‌వికాంత్ తెలిపారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా ఫస్ట్ వేవ్ కన్నా సెకండ్ వేవ్‌లో సామాన్యులతో పాటు ప్రముఖులు భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మే 8వ తేదీన కరోనా లక్షణాలు గుర్తించడంతో కుటుంబసభ్యులు సుందర్‌లాల్ బహుగుణ(Sunderlal Bahuguna)ను ఆసుపత్రిలో చేర్పించారు. అసలే వయసు మీద పడటం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. గత కొన్ని రోజులుగా ఐసీయూలో ఉంచి సీపీఏపీ థెరపి చేస్తున్నా ప్రయోజనం లేకపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆయన గాంధేయ మార్గంలో నడిచి చెట్లతో పాటు ప్రకృతి పరిక్షించారు. జంతువులతో పాటు మనుషులకు ఎంతో మేలు చేశారు.


Also Read: TS SSC Results 2021: తెలంగాణలో టెన్త్ క్లాస్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ మీకోసం



భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పర్యావరణవేత్తలకు ఆయన ప్రేరణగా నిలిచారు. ఉత్తరాఖండ్‌లోని గ‌ర్వాల్‌లో ఉన్న మ‌రోడా ఆయ‌న స్వగ్రామం. అయితే 1970 దశకంలో భారీగా చెట్ల నరికివేత కారణంగా జనజీవనంపై ప్రభావం చూపడాన్ని గమనించారు. 1974లో చిప్కో ఉద్యమాన్ని(Chipko Movement) సుందర్ లాల్ బహుగుణ ప్రారంభించారు. చిప్కో అనగా హత్తుకోవడం.. ఎవరైనా చెట్లను నరికివేయడం గమనించినట్లయితే వెంటనే వెళ్లి ఆ చెట్లను హత్తుకుని కాపాడటం దీని ఉద్దేశం. ఈ విధానం చెట్ల నరికివేతను అడ్డుకుని ప్రకృతిని సమౌతౌల్యం దెబ్బతినకుండా చూసి ఎందరికో స్ఫూర్తిగా మారారు.


Also Read: White Fungus Symptoms: సరికొత్త టెన్షన్ వైట్ ఫంగస్, Black Fungus కన్నా ప్రమాదకరం 


ప్రధాని మోదీ సంతాపం
పర్యావరణ ప్రేమికుడు సుందర్‌లాల్ బహుగుణ మరణం దేశానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రకృతిని సమౌతౌల్యం దెబ్బ తినకుండా చెట్లను కాపాడారు. ఆయన నిరాడంబర జీవితం గడిపారు. మీ కుటుంబానికి మా మద్దుతు ఎప్పటికీ ఉంటుంది. ఓం శాంతి అని ప్రధాని మోదీ ట్వీట్ ద్వారా సుందర్‌లాల్ బహుగుణ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook