Sunny Deol tests COVID-19 positive: సిమ్లా: దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. తాజాగా బాలీవుడ్ ప్రముఖ సినీనటుడు, గురుదాస్‌పూర్ బీజేపీ ఎంపీ సన్నీ డియోల్ ( Sunny Deol ) కు సైతం కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్లూ జిల్లాలో గత కొన్ని రోజులుగా గడుపుతున్న సన్నీడియోల్‌కు కరోనా పరీక్ష  జరపగా.. పాజిటివ్‌గా (COVID-19 positive) తేలిందని ఆ (Himachal Pradesh) రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి అమితాబ్ అవస్థి పేర్కొన్నారు. Also read: Farmer protests: కొలిక్కిరాని చర్చలు.. రేపు మరోసారి కేంద్రంతో భేటీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతకొన్ని రోజుల నుంచి ఎంపీ సన్నీ డియోల్, ఆయన స్నేహితులు కుల్లూ జిల్లాలో ఉంటున్నారు. కుల్లూ నుంచి ముంబై నగరానికి (Mumbai) వెళ్లాలనుకున్న క్రమంలో సన్నీడియోల్ కరోనా పరీక్ష చేయించుకోగా ఆయనకు పాజిటివ్‌గా అని తేలిందని ఆరోగ్య కార్యదర్శి చెప్పారు. 64 ఏళ్ల సన్నీడియోల్‌ ఇటీవల ముంబైలో భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం కుల్లూ జిల్లా మనాలీ సమీపంలోని ఫాం హౌస్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సన్నీ డియోల్ పంజాబ్ గురుదాస్‌పూర్ ఎంపీగా ఉన్నారు. 


Also read: Rana Daggubati: విరాట పర్వం కీలక షెడ్యూల్ కంప్లీట్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook