National Film Awards 2021: ఒకే రోజు, ఒకేస్టేజీపై మామ అల్లుళ్లకు అవార్డులు..ఆనందంలో సూపర్ స్టార్ ఫాన్స్
ఘనంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతున్న అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు..ధనుష్, ఉత్తమ నటుడుగా.. తెలుగులో జెర్సీ, మహర్షి సినిమాలకి అవార్డులు దక్కాయి.
Superstar Rajinikanth receives the Dadasaheb Phalke Award: చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు (Dada Saheb Phalke Award) ప్రధాన దినోత్సవం ఈ రోజు ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరుగుతుంది. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని కేంద్రం ఘనంగా జరుపుతుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Venkaiah Naidu) చేతుల మీదుగా భారతీయ సీని రంగంలో ఉత్తమ నటులకు, ఉత్తమ చిత్రాలకు గాను అవార్డులు అందించనున్నారు.
ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఇవ్వనున్నట్లు ఏప్రిల్ నెలలోనే కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ (Prakash Javadekar) ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ రోజు జరుగుతన్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో.. రజనీకాంత్ (Rajanikanth) అత్యంత విశిష్టమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. హీరోగానే కాకుండా.. పలు సినిమాలకు దర్శకత్వం వచిస్తూ... నాలుగు దశాబ్దాలుగా కళామాతల్లికి సేవలందిస్తున్న రజనీకాంత్ కు ఈ అవార్డును కేంద్రం బహుకరించింది. ఇప్పటికీ కుర్ర హీరోలతో ఏ మాత్రం తీసిపోకుండా సినిమాలలో నటిస్తూ... రికార్డులు శృష్టిస్తున్నారు రజనీకాంత్. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావటం చాలా అంనందంగా ఉందని రజనీకాంత్ తెలిపారు.
Also Read: India Vs Pakistan: గెలుపు తరువాత భావోద్వేగాయానికి గురైన బాబర్ అజామ్ తండ్రి.. వీడియో వైరల్
అంతేకాకుండా.. రజనీకాంత్ అల్లుడు హీరో ధనుష్ (Hero Dhanush) కూడా అసురన్ (Asuaran) సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు (Best actor Award) అందుకున్నాడు.. ఒకేసారి ఇద్దరు అవార్డులు అందుకోవటంతో.. సూపర్ స్టార్ అభిమానులకు అవధులు లేడకుండా పోతుంది.
[[{"fid":"214069","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ఇక ఉత్తమ చిత్రంగా మలయాళం (Best Movie in Malayalam) నుంచి 'మరక్కర్' (Marakkar) సినిమాకు.. భోంస్లే (Bhonsle) చిత్రానికి మనోజ్ పాయ్ (Manoj Bajpayee) ఉత్తమ నటుడిగా అవార్డు (Best Actor Award) అందుకున్నాడు..
ఉత్తమ నటిగా (Best Actress) కంగనా రనౌత్ (Kangana Ranaut) కు మణికర్ణిక (Manikarnika) చిత్రానికి గానూ అవార్డు దక్కించుకుంది.
Also Read: Bahubali Kaja: బాహుబలి కాజా చూసి ఆశ్చర్యపోయిన శర్వానంద్, రష్మిక
ఇక తెలుగు విషయానికి వస్తే.. ఉత్తమ చిత్రంగా (Best Movie) 'జెర్సీ' (Jersey)... ఉత్తమ పాపులర్ సినిమాగా (Most Popular Movie in Telugu) 'మహర్షి' (Maharshi) సినిమాలకు అవార్డులు దక్కాయి.. జెర్సీకి రెండు అవార్డులు , మహర్షి సినిమాకు మూడు అవార్డులు దక్కాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి