Supreme Court About Article 370: ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో భారీ సంఖ్యలో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా లేదా అనే విషయాన్ని మాత్రమే తాము పరిశీలిస్తామని, దేశ ప్రయోజనాల కోసం ఈ చర్య తీసుకున్నారా అనే అంశంలోకి వెళ్లబోమని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు జరిగిన రోజు 7వ రోజు విచారణలో భాగంగా జస్టిస్ డివై చంద్రచూడ్, సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవేకి పలు సూచనలు చేశారు. "ఆర్టికల్ 370ని రద్దు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుకున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మీకు న్యాయ సమీక్ష కావాలా ? లేక రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందా అని తెలుసుకోవడానికి న్యాయ సమీక్ష కోరుతున్నారా అని ప్రశ్నించారు. ఒకవేళ రాజ్యాంగ ఉల్లంఘన జరిగితే, ఆ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంటుందనడంలో ఎవ్వరికీ, ఎలాంటి సందేహం అవసరం లేదు అని జస్టిస్ చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.


సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే తన తన వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగం పరంగా భద్రతను అపహాస్యం చేసే ఏ నిర్ణయాన్ని ప్రభుత్వాలు తీసుకోలేవని.. 1975లో ఏమి జరిగిందో దేశమంతా తెలిసిందే అని అన్నారు. అందుకే సర్వాధికారాలు కలిగిన మీకు మాత్రమే ఇలాంటి నిర్ణయాలను అడ్డుకోగలిగే అవకాశం ఉందన్నట్టుగా తన వాదనని కోర్టుకు వినిపించారు.


ఇది కూడా చదవండి : Cement Block on Railway Track: తప్పిన ఘోర రైలు ప్రమాదం... ఒడిషా తరహా రైలు ప్రమాదానికి భారీ కుట్ర ?


సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే వాదనలపై చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పందిస్తూ, "రాజ్యాంగ పరిషత్తు ముగిసిన అనంతరం ఆర్టికల్ 370 తన లక్ష్యాన్ని నెరవేర్చినట్లయితే, 1957 తర్వాత రాజ్యాంగబద్దమైన ఉత్తర్వులు ఎందుకు వర్తింపజేశారని ఎదురు ప్రశ్నించారు.


ఇది కూడా చదవండి : Double Bedroom Houses Allotment: త్వరలోనే వాళ్లకి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తాం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి