Supreme Court: జమ్ము కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుపై పూర్తయిన విచారణ, తీర్పు రిజర్వ్
Supreme Court: దేశవ్యాప్తంగా అత్యంత సంచలనమైన ఆర్టికల్ 360 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం జరిపిన విచారణ పూర్తయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Supreme Court: జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సహా ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. తీర్పు ఎప్పుడు వెల్లడించేది ఇంకా స్పష్టం కాలేదు.
దేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత స్వతంత్య్ర దేశంగా ఉన్న జమ్ము కశ్మీర్ ఇండియాలో విలీనమైంది. ఆ సందర్భంగా అప్పటి పాలకుల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం జమ్ము కశ్మీర్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ప్రకారం ప్రత్యేక హోదా కల్పించారు. అప్పట్నించి జమ్ము కశ్మీర్లో ప్రత్యేక హోదా కొనసాగుతోంది. 1949 అక్టోబర్ 17న జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించారు. 2019 ఆగస్టు నెలలో బీజేపీ ప్రభుత్వం జమ్ము కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ పార్లమెంట్‌లో తీర్మానం ఆమోదించింది.
జమ్ము కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ల ధర్మాసనం 16 రోజులపాటు విచారణ జరిపి అందరి వాదనలు వింది. ఇవాళ ఆ విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది.
ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజన అనేది అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశం కావడంతో సుప్రీంకోర్టు ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. 2020లో దాదాపు 23 పిటీషన్లు దాఖలైనా అప్పట్లో ఏదీ లిస్టింగ్ కాలేదు. సుప్రీంకోర్టు కూడా విచారణకు ఆసక్తి చూపించలేదు. ఆ తరువాత మార్చ్ నెలలో లిస్టింగ్ అయినా విచారణకు నోచుకోలేదు. మూడేళ్ల తరువాత ఇప్పుడు విచారణ పూర్తయింది. ఈ సందర్భంగా ఎలాంటి తీర్పు రాబోతుంది, ఎప్పుడు వస్తుందనేది ఆసక్తిగా మారింది.
ఈ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పలు కీలక విషయాలను సమగ్రంగా విచారించింది. పిటీషనర్ల అభ్యంతరాల్ని స్వీకరించింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజనపై కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు విన్పించారు. జమ్ము కశ్మీర్‌కు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని..తాత్కాలికమేనని ఈ సందర్భంగా తుషార్ మెహతా స్పష్టం చేశారు. ఎప్పుుడ రాష్ట్ర హోదా ఇచ్చేది నిర్ధిష్టంగా చెప్పలేమన్నారు. జమ్ము కశ్మీర్‌లో మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్రం అంగీకారం కూడా తెలిపింది.
Also read: G20 Summit 2023: జీ20కు డిల్లీ సిద్ధం, ఎవరు వస్తున్నారు, ఎవరెవరు రావడం లేదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook