కొలీజియం వ్యవస్థ కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు మధ్య అంతరాన్ని పెంచుతోంది. ఈ వ్యవస్థకు ప్రత్యామ్నాయం రావాలని కేంద్ర న్యాయశాఖ మంత్రి బాహాటంగా విమర్శిస్తున్న పరిస్థితి. అదే సమయంలో సుప్రీంకోర్టు సీజేఐ కూడా కౌంటర్ ఇచ్చేస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రంలోని గత ప్రభుత్వాల మాటేమో గానీ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కొలిజీయం వ్యవస్థపై సదభిప్రాయం లేదు. సాక్షాత్తూ కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పలు సందర్భాల్లో కొలీజియం వ్యవస్థను విమర్శిస్తూ బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. తాజాగా మరోసారి వ్యాఖ్యలు చేశారు. ప్రతి వ్యవస్థకు లక్ష్మణరేఖ ఉంటుందని కిరణ్ రిజిజు చెప్పడం సంచలనంగా మారింది. ఈ వ్యాఖ్యల ద్వారా కొలీజియం వ్యవస్థ పరిపూర్ణమైంది, అతీతమైంది కాదని పరోక్షంగా సంకేతాలు పంపించారు. 


సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలు


ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కౌంటర్ ఇచ్చేశారు. న్యాయమూర్తుల నియామకానికి అత్యుత్తమ వ్యవస్థ కొలీజియం మాత్రమేనని సీజేఐ చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థకు భారతీయత జోడించాల్సిన అవసరముందని..ఏ వ్యవస్థ కూడా పరిపూర్ణమైంది కాదని తెలిపారు. ఈ విషయంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజుతో వాదించాలనుకోవడం లేదని సీజేఐ చెప్పారు. ఇద్దరికీ భిన్నాభిప్రాయలుంటే తప్పేంటని..న్యాయవ్యవస్థలో కూడా ఈ పరిస్థితి ఉంటుందన్నారు. తీర్పుల్లో ఇతరుల జోక్యంపై స్పందించారు. కేసులో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా..ప్రభుత్వం నుంచి ఏ విధమైన ఒత్తిడి ఉండదని చెప్పారు. న్యాయమూర్తిగా 23 ఏళ్ల తన కెరీర్‌లో ఏదైనా కేసు విషయమై ఇలాంటి తీర్పు ఇవ్వాలంటూ ఎవరూ చెప్పలేదన్నారు. 


కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వ్యాఖ్యలు


కార్య నిర్వాహక, న్యాయ వ్యవస్థ సహా అనేక వ్యవస్థలకు రాజ్యాంగ లక్ష్మణ రేఖ ఉందన్నారు మంత్రి కిరణ్ రిజిజు. పాలనాపరమైన నియామకాల్లో న్యాయమూర్తులు భాగమైతే తీర్పులు ఎవరు చెప్పాలని ప్రశ్నించారు. చట్టం చేసే వరకూ కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్, ఇద్దరు కమీషనర్ల నియామకానికి ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు సీజేఐ, ప్రతిపక్షనేతతో కమిటీ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై ఆయన స్పందించారు. ఎన్నికల సంఘం కమీషనర్ల నియామకం ఎలా ఉండాలనేది రాజ్యాంగంలో ఉందన్నారు. కొందరు విశ్రాంత న్యాయమూర్తులు, సామాజిక కార్యకర్తలు భారత వ్యతిరేక ముఠాతో కలిసి న్యాయవ్యవస్థను ప్రతిపక్షపాత్ర పోషించేలా చేస్తున్నాయని విమర్శించారు. 


Also read: Gaganyaan Yatra: గగన్‌యాన్ యాత్రపై స్పష్టత, ఈ ఏడాది మే నెలలోనే గగన్‌యాన్ ప్రయోగం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook