Loksabha Elections 2024: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు బిగ్ రిలీఫ్, మనీ లాండరింగ్ కేసు కొట్టివేత
Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు ఉపశమనం లభించింది. సంచలనం రేపిన మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు రిలీఫ్ ఇచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: కర్ణాటక కాంగ్రెస్ ఛీఫ్, డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఉన్న మనీ లాండరింగ్ కేసును సుప్రీంకోర్టు ఇవాళ కొట్టివేసింది. 2018కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసు ఇది. మరో నెలరోజుల్లో లోక్‌సభ ఎన్నికలున్న తరుణంలో డీకేపై కేసు కొట్టివేయడం భారీ ఉపశమనంగా ఉంది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు 2018లో కేసు నమోదు చేయగా, 2019 సెప్టెంబర్ నెలలో అరెస్టుు చేశారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2017లో డీకే స్థలాలపై ఆదాయపు పన్ను శాఖ దాడుల అనంతరం ఈడీ దర్యాప్తు చేసి కేసు నమోదు చేసింది. 300 కోట్ల విలువైన నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించిన డీకే శివకుమార్‌కు అక్కడ ఎలాంటి రిలీఫ్ లభించలేదు. దాంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిరుధ్ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం విచారించింది. డీకే శివకుమార్ నుంచి స్వాధీనం చేసుకున్న నగదు ఎక్కడ్నించి వచ్చిందో కనుగొనడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విఫలమైందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. మొత్తానికి మరి కొద్దిరోజుల్లో లోక్‌సభ ఎన్నికలున్న తరుణంలో మనీ లాండరింగ్ కేసు కొట్టివేయడంతో డీకే శివకుమార్ ఊపిరిపీల్చుకున్నారు.
Also read: EPFO Account: అడ్వాన్స్ పీఎఫ్ డబ్బులు ఆన్‌లైన్‌లో ఎలా విత్ డ్రా చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook