Loksabha Elections 2024: ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు ఊరట లభించేనా, ఈ నెల 7న కీలక విచారణ
Loksabha Elections 2024: దేశంలో లోక్‌సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి కేజ్రీవాల్‌కు మద్యంతర బెయిల్ విషయంలో పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం గమనార్హం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Loksabha Elections 2024: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు కోరారు.
ఢిల్లీ మధ్యం కుంభకోణం కేసులో మద్యంతర బెయిల్ కోరుతూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు జరిగాయి. ఎన్నికల్ని దృష్టిల ఉంచుకుని బెయిల్ పిటీషన్‌పై ఇరువర్గాల వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసినా, చేయకపోయినా ఏ వర్గం ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ నెల 7వ తేదీన ఈ అంశంపై విచారణ జరుపుతామని, ఇందుకు సిద్ధంగా ఉండాలని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ న్యాయవాదికి సుప్రీం ధర్మాసనం సూచించింది. ఎన్నికల నేపధ్యంలో మద్యంతర బెయిల్ అంశం పరిగణలో తీసుకుంటామని సుప్రీంకోర్టు సూచించడం అరవింద్ కేజ్రీవాల్ వర్గాల్లో ఆనందం రేకెత్తిస్తోంది.
మద్యం కుంభకోణం కేసులో అరెస్టుకు వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటీషన్‌పై విచారణకు ఇంకా సమయం పడుతుందని, అందుకే మద్యంతర బెయిల్‌పై విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది. అయితే మద్యంతర బెయిల్ పిటీషన్‌ను ఈడీ వ్యతిరేకించనుంది. ఈ విషయాన్ని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు కోర్టుకు స్పష్టం చేయండంతో తాము మద్యంతర బెయిల్‌పై విచారణ చేస్తామని మాత్రమే చెప్పినట్టు, బెయిల్ ఇస్తామని కచ్చితంగా చెప్పలేదని కోర్టు వివరించింది. మద్యంతర బెయిల్‌పై వాదనలకు రెండు వర్గాలు సిద్ధంగా ఉండాలని సూచించింది. ఒకవేళ మద్యంతర బెయిల్ మంజూరైతే ఏ షరతులు విధించాలి, ముఖ్యమంత్రిగా ఎలాంటి ఫైళ్లపై సంతకాలు చేయవచ్చు, ఎలాంటివాటిపై సంతకాలు చేయకూడదో కూడా పరిశీలించాలని సుప్రీంకోర్టు ఈడీకు తెలిపింది.
ఈ నెల 7వ తేదీ మంగళవారం అరవింద్ కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ విషయంలో కీలక నిర్ణయం వెలువడే అవకాశాలు కన్పిస్తున్నాయి. బెయిల్‌పై వాదనల అనంతరం బెయిల్ మంజూరు చేసినా. చేయకపోయినా రెండింటికీ రెండు వర్గాలు సిద్ధంగా ఉండాలని కోర్టు సూచించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook