Rajiv Gandhi Murder Case: భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 30 ఏళ్లపాటు జైళ్లో ఉన్న ఆ నిందితుడి విడుదలకు ఆదేశాలిచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే నెలలో తమిళనాడులో హత్యకు గురయ్యారు. ఈ కేసులో పెరరివాలన్ ఓ దోషి. 30 ఏళ్లుగా జైలు శిక్షఅనుభవించాడు. ఇకనైనా శిక్ష నుంచి మినహాయించాలంటూ 2018లో తమిళనాడు ప్రభుత్వం సిఫారసు చేసినా..అమలు కాలేదు. దాంతో పెరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.


19 ఏళ్ల వయస్సులో పెరరివాలన్ ఈ కేసులో అరెస్టయ్యాడు. 1999 మే నెలలో మరణశిక్ష విధించింది కోర్టు. రాజీవ్ గాంధీని చంపేందుకు ఉపయోగించిన బెల్ట్ బాంబులో 8 ఓల్ట్ బ్యాటరీని పెరరివాలన్ కొనుగోలు చేశాడు. ఇతడితో పాటు మురుగన్, సంతన్‌లు క్షమాభిక్ష పెట్టుకున్నారు. దాంతో మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు. ఆ తరువాత 2018లో అప్పటి తమిళనాడు ప్రభుత్వం పెరరివాలన్‌తో పాటు మరో ఆరుగురు దోషుల్ని ముందస్తుగా విడుదల చేయాలంటూ గవర్నర్‌కు సిఫారసు చేసినా..గవర్నర్ దాన్ని పెండింగులో పెట్టేశారు. ఫలితంగా విడుదలకు ఆలస్యమవుతోందని పెరరివాలన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.


దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం..ఆర్టికల్ 161 ప్రకారం తమిళనాడు గవర్నర్ అధికారాల్ని ఉపయోగించుకోవడంలో విపరీతమైన జాప్యం..న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని తెలిపింది. తక్షణం విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశిల్చింది.


Also read: Breaking News: గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి హార్దిక్ పటేల్ రాజీనామా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.