Adani Issue: అదానీ వ్యవహారంపై కేంద్రానికి షాక్, సీల్డ్ కవర్‌కు నో చెప్పిన సుప్రీంకోర్టు
Adani Issue: హిండెన్‌బర్గ్ అదానీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారంపై దాఖలైన పిటీషన్లపై విచారణ జరగడమే కాకుండా..నిపుణుల కమిటీ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
అదానీ-హిండెన్‌బర్గ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి షాక్ తగిలింది. అదానీ వివాదం పరిశీలనకై కేంద్ర ప్రభుత్వం సూచించిన సీల్డ్ కవర్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిపుణుల కమిటీని స్వయంగా ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది.
అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక కారణంగా అదానీ గ్రూప్ షేర్లు ఘోరంగా పతనమౌతున్నాయి. ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతున్నారు. కోట్లాది ఇన్వెస్టర్ల సంపదను తుడిచిపెట్టిన అదానీ వ్యవహారంతో ప్రభుత్వంపై భారీగా విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారాన్ని పరిశీలించేందుకు న్యాయమూర్తి సహా నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే సెబి పటిష్టత కోసం ప్యానెల్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిపుణుల కమిటీ పేర్లను సీల్డ్ కవర్‌లో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించగా..ఆ సీల్డ్ కవర్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
షేర్ మార్కెట్ నియంత్రణ చర్యల్ని బలోపేతం చేసేందుకు, మార్కెట్‌లో ఇన్వెస్టర్లను రక్షించేందుకు ఏర్పాటు కానున్న ప్యానెల్ వివరాలు సీల్డ్ కవర్‌లో ఇవ్వడం మంచిది కాదని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్పష్టం చేశారు. తమకు సీల్డ్ కవర్ వద్దని..ఈ అంశంలో పూర్తి పారదర్శకత కోరుతున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. సీల్డ్ కవర్ సూచనల్ని అంగీకరిస్తే..అది తాము కోరని..ప్రభుత్వం నియమించిన కమిటీ అవుతుందని పేర్కోంది. ఇక నిపుణులు కమిటీ ఎంపిక నిర్ణయాన్ని తమకు వదిలేయాలని..తామే నిపుణుల కమిటీని నియమిస్తామని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు.
మరోవైపు ఇదే అంశంపై దాఖలైన పలు పిటీషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కమిటీపై తన ఉత్తర్వుల్ని రిజర్వ్‌లో ఉంచింది. అదానీ కంపెనీల ఆడిటింగ్ వివరాలతో పాటు రుణాలిచ్చిన బ్యాంకు వివరాలు తెలియజేయాలని ఓ పిటీషనర్ కోరారు. ఇక హిండెన్‌బర్గ్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని మరో పిటీషన్ దాఖలైంది. హిండెన్‌బర్గ్ నివేదికపై సుప్రీంకోర్టు ఆధారిత సిట్ దర్యాపు కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఒక పిటీషన్ దాఖలు చేశారు.
మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తామని, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు ఉంటుందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు.
Also read: Interest Free Loan: ఈ రాష్ట్ర రైతులకు గుడ్‌న్యూస్.. రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook