సుప్రీంకోర్టు ఓ కేసుకు సంబంధించి క్షమాపణ చెప్పిన చెప్పిన అరుదైన సందర్భమిది. అందుకు కారణం ఆ కేసు సుప్రీంకోర్టులోనే 8 ఏళ్లు సాగడం. ఒక మహిళ కేసు 13 ఏళ్లు ఆలస్యం కావడంతో అత్యున్నత న్యాయస్థానం బాధితురాలికి క్షమాపణ చెప్పింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్ లోని రూర్కీ ప్రాంతానికి చెందిన శ్యామలత అనే మహిళ.. తన సోదరులు ఆస్తిపత్రాలను ఫోర్జరీ చేసి, షాపును ఆక్రమించుకున్నారని స్థానిక పోలీస్ ఠాణాలో 2004లో కేసు పెట్టింది. ఆ కేసును జిల్లా సెషన్స్ కోర్టు విచారిస్తున్న తరుణంలో శ్యామలత సోదరుల్లో ఒకరు కోర్టులో ఓ పిటీషన్ వేశాడు. తీర్పు అనుకూలంగా రాకపోవడంతో హైకోర్టు ను ఆశ్రయించగా అక్కడ మరో విధంగా తీర్పు వచ్చింది. 


కోర్టులలో తీర్పులు భిన్నంగా రావడంతో శ్యామలత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు ఆ కేసును స్వీకరించి 8 ఏళ్ల పాటు విచారణ చేపట్టింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పే ఈ కేసుకు వర్తిస్తుందని తీర్పు చెప్పిన ధర్మాసనం.. ఓ మహిళ కేసు విచారణ 13 ఏళ్లు ఆలస్యం కావడంపై క్షమాపణ కోరింది. అయితే అప్పటికే అంటే 2009లోనే బాధితురాలు శ్యామలత మరణించడం గమనార్హం.