Supreme Court: కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా అధికార పార్టీతో స్నేహమనేది అధికారులకు ఇప్పుడు సాధారణంగా మారింది. ముఖ్యంగా పోలీసు శాఖ..అధికార పార్టీతో సన్నహితంగా ఉంటోంది. ఈ వ్యవహారంపై ఇప్పుడు సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ(Justice NV Ramana)నేతృత్వంలోని ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతున్నాయి. రాజకీయనేతలు, అధికారుల మధ్య సంబంధాలపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలే చేసింది. అధికార పార్టీ నేతలతో అధికారులు స్నేహం చేయడం కొత్త ట్రెండ్‌గా మారిందని మండిపడింది. ప్రభుత్వం మారిన క్రమంలో అంతకుముందు ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన అధికారులపై వచ్చే క్రిమినల్ కేసుల్నించి తామెందుకు రక్షించాలని ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ కోరారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గుర్జీందర్ పాల్ సింగ్ కేసు(Gurjinder pal singh) వ్యవహారంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


గుర్జీందర్ సింగ్ గతంలో ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh)బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఆ తరువాత పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రభుత్వం మారిన తరువాత అవినీతి నిరోధక శాఖ, ఆర్ధిక నేరాల విభాగం సోదాలు జరిపింది. ఆదాయానికి మించి ఆస్థులున్నాయని కేసు నమోదు చేసి..సస్పెండ్ చేసింది. అంతేకాదు వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని..ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని రాజద్రోహం కేసు నమోదు చేసింది ప్రభుత్వం.ఈ కేసు కొట్టివేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు గుర్జీందర్ పాల్ సింగ్. హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టుకు(Supreme Court)అప్పీల్ చేశారు. ఈ కేసులో విచారణ జరిపిన సుప్రీంకోర్టు అతనిపై చర్యల్ని కొద్దికాలం నిలిపివేయాలని..ఆరోపణలపై సమాధానమివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


తాజాగా ఇప్పుడు ఈ కేసు మరోసారి విచారణకొచ్చింది. ఈ సందర్బంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పదవిలో ఉన్నవారితో అతి సాన్నిహిత్యం వల్లనే ఇలా జరుగుతుందని..ఏదో రోజు మూల్యం చెల్లించుకోవల్సి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇటువంటివారిని ఎందుకు రక్షించాలని..జైలుకు వెళ్లాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తక్షణం దిగువ కోర్టులో లొంగిపోయి..ఆ తరువాత బెయిల్‌కు ప్రయత్నించాలని సూచించింది. 


Also read: Housing Loan: హౌసింగ్ లోన్ కోసం ఏ డాక్యుమెంట్లు అవసరమో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి