Ram Setu: వివాదాస్పద రామసేతు ప్రాంతం మరోసారి వార్తల్లోకెక్కింది. రామసేతు అంశంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరిపాలనా అంశాలపై తామెలా సూచనలిస్తామని కోర్టు ప్రశ్నించింది. అసలేం జరిగిందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత-శ్రీలంక మధ్య సముద్రం అంతర్బాగంలో వంతెనలా కన్పించే రాళ్ల అమరికను రామసేతుగా పిలుస్తారు. దీనినే ఆడమ్స్ బ్రిడ్జి అని కూడా అంటారు. అది తమిళనాడులోని ఆగ్నేయతీరంలో ఉన్న పాంబన్ ద్వీపం, శ్రీలంక వాయువ్య తీరంలోని మన్నార్ ద్వీపం మద్య ఉన్న సున్నపురాయి ఉద్గారాల శ్రేణి. ఈ రామసేతును ప్రజలకు కన్పించేలా గోడ నిర్మించాలని హిందూ పర్సనల్ లా బోర్డ్ తరపున అశోక్ పాండే సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. రామసేతుని జాతీయ వారసత్వ సంపదగా ప్రకటించాలని కోరారు. మరోవైపు ఇదే అంశంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి పిటీషన్ ను తన పిటీషన్‌తో జత చేయాలని పిటీషనర్ కోరాడు. రామసేతును జాతీయ వారసత్వ కట్టడంగా ప్రకటించాలనేది సుబ్రహ్మణ్యస్వామి పిటీషన్ సారాంశంగా ఉంది. 


ఈ పిటీషన్ విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణకు తిరస్కరించింది. గోడ నిర్మించాలనే పరిపాలనాపరమైన నిర్ణయాన్ని కోర్టు ఎలా ఆదేశిస్తుందని పిటీషనర్‌ను ప్రశ్నించింది సుప్రీంకోర్టు. ఈ పిల్‌ను జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్షు ధులియా ధర్మాసనం విచారించింది. ప్రభుత్వానికి సంబంధించిన అంశాన్ని తామెలా పరిగణిస్తామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 


Also read: Ycp Strategy: లోకేశ్ చుట్టూ కేసులు, వైసీపీ వ్యూహం అదేనా, ఇప్పట్లో అరెస్ట్ ఉండదా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook