Supreme court: బిలియన్ , ట్రిలియన్ డాలర్ల వ్యాపారం కంటే ప్రజల వ్యక్తిగత గోప్యతే విలువైనది. ప్రజల ప్రైవసీను కాపాడటంలో తప్పకుండా జోక్యం చేసుకుంటాం. ఫేస్‌బుక్, వాట్సప్‌ల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలివి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్ ( Facebook ), వాట్సప్ ( Whatsapp )‌లకు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది.  2021 జనవరిలో వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీను తీసుకొచ్చింది. దీని ప్రకారం వాట్సప్ తన యూజర్లకు సంబంధించిన బిజినెస్ సంభాషణను ఫేస్‌బుక్‌తో షేర్ చేసుకోవచ్చు. కొత్త పాలసీను యూజర్లు అంగీకరించకపోతే ఫిబ్రవరి 8 నుంచి సంబంధిత వాట్సప్ ఎక్కౌంట్లు పని చేయవని వాట్సప్ వెల్లడించింది. దాంతో కొంతమంది యూజర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కొత్త ప్రైవసీ పాలసీ వల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాట్సప్ ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ పాలసీ ( Whatsapp new privacy policy )పై స్టే విధించాలని సుప్రీంకోర్టును కోరారు పిటీషనర్లు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ( Chief justice sa bobde ) కీలక వ్యాఖ్యలు చేశారు. వాట్సప్, ఫేస్‌బుక్ సంస్థలకు చీవాట్లు పెట్టింది.


మీరు అంటే వాట్సప్, ఫేస్‌బుక్  సంస్థలు బిలియన్, ట్రిలియన్ డాలర్ కంపెనీ కావచ్చు. కానీ ప్రజల వ్యక్తిగత గోప్యత అంతకంటే విలువైనదని, ఆ గోప్యతను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని సుప్రీంకోర్టు ( Supreme court ) వ్యాఖ్యానించింది. మీరు ప్రవేశపెట్టిన వాట్సప్, ఫేస్‌బుక్ లు ప్రవేశపెట్టిన కొత్త ప్రైవసీ వల్ల తమ గోప్యతకు భగం వాటిల్లుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎవరో ఒకరికి పంపిన సందేశాల్ని వాట్సప్, ఫేస్‌బుక్‌తో పంచుకోవడం పట్ల యూజర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు వాట్సప్, ఫేస్‌బుక్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. అటు కేంద్రానికి కూడా నోటీసులు పంపింది. 


Also read: FASTag: నేటి అర్ధరాత్రి నుంచి ఫాస్టాగ్ వాడకం తప్పనిసరి, దీని ఉపయోగం ఏమిటి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook