Tirumala Laddu Row: తిరుమల లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ గత ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వ నేతలు చేసిన ఆరోపణలతో తిరుపతి లడ్డూ వివాదాస్పదమైంది. నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఆధారాల్లేకుండా బహిరంగ వ్యాఖ్యలు చేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును తప్పుబట్టిన న్యాయస్థానం ఇవాళ తదుపరి విచారణ చేపట్టింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ పర్యవేక్షణలో ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు చేయాలని కోరింది. ఈ కేసును సీబీఐ ఎందుకు పర్యవేక్షించకూడదు, కల్తీ జరిగిందని మీరు ఊహించనుకుంటున్నారా అని ప్రశ్నించింది. కల్తీ నెయ్యి విషయమై ఆధారాలు లేకపోయినా కోట్లాది భక్తుల మనోభావాలు గాయపరిచే విధంగా చంద్రబాబు వ్యవహరించాలని సెప్టెంబర్ 30 న జరిగిన విచారణలో కోర్టు తెలిపింది. ఏపీ పోలీసులు, సీబీఐ, FSSAI ప్రతినిధులతో కూడిన సిట్ దర్యాప్తు జరపాలని జస్టిస్ గవాయి తెలిపారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో దర్యాప్తు జరిగితే బాగుంటుందని కోర్టు అభిప్రాయపడింది. 


తిరుపతి లడ్డూపై దర్యాప్తుకు ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు


కోట్లాది మంది భక్తుల మనోభావాలు, నమ్మకాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక సిట్ ఎలా ఉండాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జే గవాయ్ సూచించారు. ఈ కమిటీలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు అధికారులు ఉండాలి. మరో ఇద్దరు అధికారులు ఏపీ పోలీస్ శాఖ నుంచి ఉండాలి. ఒకరు FSSAI నుంచి ఉండాలి. 


ఈ కేసును టీటీడీ తరపున సిద్ధార్ధ లూథ్రా, ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గీ వాదిస్తుండగా కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తున్నారు. రాజకీయంగా లడ్డూపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని కోర్టు సూచించింది. 


Also read: Railway Jobs: కేవలం 10వ తరగతి విద్యార్ఙతతో 63 వేల జీతంతో రైల్వేలో ఉద్యోగాలు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.