Railway Recruitment 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్ వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తుంటే ఇదే మంచి అవకాశం. గ్రూప్ సి, గ్రూప్ డి కేటగరీ పోస్టులకు సంబంధించి రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ ఖాళీలు భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు wcr.indianrailways.gov.in.ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు
కేవలం 10వ తరగతి, ఐటీఐ విద్యార్హతతో రైల్వేలో ఉద్యోగాలు సాధించేందుకు అద్భుతమైన అవకాశం. 63 వేల భారీ జీతంతో ఉద్యోగాలు కొలువుదీరనున్నాయి. రైల్వేలో ఉద్యోగం కోసం చూసేవారికి ఇదే మంచి అవకాశం. దరఖాస్తు చేసేందుకు అక్టోబర్ 19 చివరి తేదీ. ఇందులో లెవెల్ 1, లెవెల్ 2 కేటగరీలు ఉన్నాయి. కనీసం 18 ఏళ్లు గరిష్టంగా 30 ఏళ్లుండాలి. ఇక లెవెల్ 2 అయితే 18 నుంచి 33 ఏళ్లుండాలి. రైల్వేలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు పదో తరగతి ఉత్తీర్ణులై ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
రైల్వే రిక్రూట్‌మెంట్ 2024 ద్వారా ఎంపికైన అభ్యర్ధులకు గ్రూప్ సి లెవెల్ 2 అయితే 19,900 నుంచి 63,200 జీతం ఉంటుంది. ఇది 7వ వేతన సంఘం మేరకు ఉంటుంది. ఇక గ్రూప్ డి లెవెల్ 1 అయితే 18 వేల నుంచి 56,900 రూపాయలు 7వ వేతన సంఘం ప్రకారం ఉంటుంది. జనరల్, ఓబీసీ కేటగరీ అభ్యర్ధులకు ఫీజు 500 రూపాయలుంటుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, వికలాంగులకు రాయితీ ఉంటుంది. మైనార్టీ, ట్రాన్స్‌జెండర్, ఫీమేల్ అభ్యర్ధులకు కూడా 500 ఫీజు ఉంటుంది. ఇక ఈబీసీ అభ్యర్ధులకు 250 రూపాయలుంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల్ని రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
Also read: PM Kisan Yojana: రేపే రైతుల ఖాతాల్లో రూ.2000 జమా.. కేవైసీ పూర్తి చేశారా? హెల్ప్‌లైన్ నంబర్స్ ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.