Supreme court takes suo motu cognizance of kolkata doctor rape and murder case: కోల్ కతా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం, హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసలను మిన్నంటాయి. దీనిపై ఇప్పటికే డాక్టర్లు అన్నివర్గాల ప్రజలు తమ నిరసనలు తెలియ జేశారు. ఏకంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తమ సేవలకు ఒక రోజు బంద్ కు పిలుపునిచ్చింది. అంతేకాకుండా.. దేశమంతాట ఈ ఘటనపై నిరసనలు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై తాజాగా, మరోక కీలక పరిణామం చోటు చేసుకుంది. కోల్ కతా ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీవ్ర  ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల సెక్యురిటీపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తు, ఘటనను ఖండించారు. అంతే కాకుండా.. దీనిపై మంగళవారం విచారణ జరపునున్నట్లు తెలిపారు.  ఈ నెల 20 న దీనిపై విచారణ జరపునున్నట్లు తెలిపారు. అంతేకాకుండా.. ఉదయం 10 గంటలకు టాప్ ప్రయారిటీ కింద ఈ అంశం విచారణకు రానున్నట్లు తెలుస్తోంది.


చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీవై చంద్రచూడ్ సారథ్యంలో.. జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనున్నట్లు తెలుస్తోంది.ఏకంగా అత్యున్నత ధర్మాసనం సుమోటో స్వీకరించడంతో ఈ ఘటననలో మరో మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. ఆగస్టు 9 న జూనియర్ డాక్టర్ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.


సెమినార్ హల్ లో ఒంటిపై బట్టలుకూడా లేకుండా అచేతనంగా పడిపొయి ఉంది. అంతేకాకుండా ఆమె శరీరంపై బట్టలు కూడాలేదని విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత యువతి ఘటనను ఆత్మహ్యగా చెప్పినట్లు తెలుస్తోంది.ఆ తర్వాత ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా.. పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Read more: Mohanlal:  ఆస్పత్రిలో అడ్మిట్ అయిన మలయాళ స్టార్ హీరో.. టెన్షన్ లో ఫ్యాన్స్... అసలేం జరిగిందంటే..?  


యువతి శరీరంలో 150 ఎం ఎల్ కు పైగా వీర్యం ఉన్నట్లు వైద్యులు పోస్ట్ మార్టం రిపోర్టులో వెల్లడించారు. అంతేకాకుండా.. ఆమె కళ్లు, నోటిలో నుంచి రక్తం కూడా బ్లీడింగ్ అయినట్లు తెలిపారు. ఆమె గొంతు దగ్గరు ఎముక పూర్తిగా ఒత్తిపెట్టినట్లు ఉండటంతో పాటు, అంతర్గత అవయవాలు పూర్తిగా డ్యామేజ్ అయినట్లు కూడానాలుగు పేజీల రిపోర్టులో వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. మరోవైపు సీబీఐ దీనిపై విచారణ చేపట్టింది. నిందితుడికి లైవ్ డిటెక్టర్ టెస్టుల చేేసేందుకు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి