Pegasus Spyware: వివాదాస్పద పెగసస్ సాఫ్ట్‌వేర్‌పై సుప్రీంకోర్టు ప్యానెల్ కీలక సూచనలు చేసింది. ఇజ్రాయిల్ సంస్థ ఎన్‌ఎస్‌వో అభివృద్ది చేసిన పెగసస్ దేశంలో వివాదాస్పదం కావడంతో విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు..పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఆ నోటీసులో ఏముందంటే..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్ఓ (NSO Group) అభివృద్ధి చేసిన పెగసస్ స్పైవేర్ ప్రపంచవ్యాప్తంగా కలకలం కల్గించింది. ఇటు ఇండియాలో కూడా పెగసస్ స్పైవేర్‌పై ఆందోళన అధికమైంది. దేశంలో వివాదాస్పదమై ఆందోళన రేపుతున్న ఈ సాఫ్ట్‌వేర్‌పై వచ్చిన ఫిర్యాదులపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. విపక్ష పార్టీల ముఖ్యనేతలు, ప్రముఖ సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, జడ్జీలు సహా ప్రముఖుల మొబైల్‌ ఫోన్లను మోదీ ప్రభుత్వం పెగసస్‌ స్పైవేర్‌తో హ్యాక్‌ చేసి నిఘా పెట్టిందనేది ప్రధానంగా విన్పించిన ఆరోపణ.పెగసస్ స్పైవేర్‌పై దర్యాప్తులో భాగంగా సుప్రీంకోర్టు సాంకేతిక కమిటీని నియమించింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్యానెల్ కమిటీ (Supreme Court) కీలక సూచనలతో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. 


పెగసస్ స్పైవేర్ (Pegasus Spyware) కారణంగా ఎవరైనా తమ మొబైల్ హ్యాకింగ్‌‌పై గురైనట్టు భావిస్తే..బాధితులు జనవరి 7వ తేదీలోగా తమను సంప్రదించాలని ప్రజలకు సూచించింది. పెగసస్ స్పైవేర్ కారణంగా తమ ఫోన్ హ్యాక్ అయిందని ఎందుకు భావిస్తున్నారో తగిన కారణాల్ని కమిటీ ముందు బాధితులు వెల్లడించాల్సి ఉంటుంది. హ్యాక్ అయిన మొబైల్ లేదా డివైజ్‌‌‌ను సుప్రీంకోర్టు నియమించిన సాంకేతిక కమిటీ పరిశీలనకు అంగీకరిస్తారా లేదా అనే విషయాన్ని కూడా కమిటీకు పంపించే మెయల్‌లో స్పష్టం చేయాల్సి ఉంటుందని పబ్లిక్ నోటీసులు వెల్లడించారు. ఒకవేళ బాధితులు చెప్పే కారణాలు సహేతుకమైనవని భావిస్తే..కమిటీ ఆ డివైజ్‌ను పరిశీలన కోసం తీసుకుంటుందని తెలిపింది. 


Also read: Good News: ఒమిక్రాన్‌పై గుడ్‌న్యూస్, ఇక ఆందోళన అవసరం లేదట


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook