Supreme Court: స్వలింగ సంపర్కులు తమ వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు వేర్వేరు తీర్పులిచ్చింది. ఈ అంశంపై చట్టాలు ఎవరు తయారు చేయాలనేది స్పష్టత ఇచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చాలాకాలంగా పెండింగులో ఉన్న స్వలింగ సంపర్క విహాహాల చట్టబద్ధతపై సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చేసింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. ప్రత్యేక వివాహ చట్టం రాజ్యాంగ విరుద్ధం కాదని, అయితే చట్టాన్ని తయారు చేయాల్సింది పార్లమెంట్ అని తేల్చిచెప్పింది. అయితే ఆ చట్టం న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తెలిపింది. ఈ కేసులో విచారణల అనంతరం తీర్పు రిజర్వ్ చేసిన 5 నెలల తరువాత ఇవాళ తీర్పు వెలువడింది. స్వలింగ సంపర్క వివాహార చట్టబద్దతపై దాదాపు 20 పిటీషన్లు దాఖలయ్యాయి.


క్వీర్ యూనియన్‌లోని వ్యక్తుల హక్కులు, అర్హతలు నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం కమిటీ నియమించాలని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. కమిటీ నివేదికను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పరిశీలించాలని సూచించారు. వస్తువులు, వాటి సేవలు పొందడంలో క్వీర్ కమ్యూనిటీకి ఎలాంటి వివక్ష లేదని తెలిపింది. ఈ విషయంలో నాలుగు వేర్వేలు తీర్పులుంటాయని జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. ప్రాధమిక హక్కుల్ని పరిరక్షించేందుకు కోర్టు ఆదేశాలు జారీచేయకుండా ఎవరూ అడ్డుకోలేరని అదే సమయంలో న్యాయస్థానాలు చట్టాలు చేయవని చెప్పారు. స్వలింగ సంపర్కం, హోమో సెక్సువాలిటీ అనేది నగరాలు, పట్టణ భావన కాదని, సమాజంలో ఒక వర్గానికే పరిమితం కాదని చెప్పారు. వివాహం స్థిరమైన, మార్పులేని సంస్థగా చెప్పడం సరికాదన్నారు. ప్రత్యేక వివాహ చట్టాన్ని కొట్టివేస్తే అది దేశాన్ని స్వాతంత్య్రానికి పూర్వానికి తీసుకెళ్తుందన్నారు. 


ప్రత్యేక వివాహ చట్టంలో మార్పు అవసరమా లేదా అనేది పార్లమెంట్ నిర్ణయించాల్సిన అంశంగా కోర్టు తెలిపింది. అందుకే ఈ విషయంలో చట్టం చేయాల్సింది పార్లమెంట్ మాత్రమేనని చెప్పడంతో ఈ అంశం ఇప్పుడు తిరిగి పార్లమెంట్ పరిధికి చేరింది. ఈ అంశంపై మార్చ్  13న కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ అఫిడవిట్ దాఖలు చేసింది. స్వలింగ వివాహాల చట్టబద్దతకు నో చెప్పింది. సహజ ప్రకృతికి విరుద్ధంగా జరిపే లైంగిక చర్యలు శిక్షార్హమని ఐపీసీ సెక్షన్ 377 చెబుతోందని కేంద్రం తెలిపింది. ఈ నేపధ్యంలో సుప్రీంకోర్టు ఇప్పుడు చట్టం చేయాల్సింది పార్లమెంట్ బాధ్యతగా చెప్పడంతో ఇక ఇది ప్రశ్నార్ధకమే కానుంది.


Also read: UPSC Recruitment 2023: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్ 2023 నోటిఫికేషన్ విడుదల, ఉద్యోగ, అర్హత వివరాలు ఇలా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook