Supreme Court gives 24 hours to Centre, Delhi govt to take action on air pollution: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యంపై.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు మరోసారి వార్నింగ్ ఇచ్చింది. చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వాలు చెప్పినప్పటికీ.. కాలుష్యం (Delhi Air Pollution) తగ్గకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కాలుష్య నివారణ చర్యల విషయంపై నేడు విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. కాలుష్య నివారణలో పురోగతి లేదని, సమయం మాత్రం వృధా అవుతోందని (Supreme court on Delhi air Pollution) పేర్కొంది. ఇదే విషయంపై విచారణ జరగటం వరుసగా ఇది నాలుగోవారమని సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ నేతృత్వంలోని (Chief Justice NV Ramana on Delhi air pollution) ధర్మాసనం గుర్తు చేసింది.


కేంద్రం, ఢిల్లీ, రాజధాని సరిహద్దు రాష్ట్రాలు.. పారిశ్రామిక, వాహనాల వల్ల వచ్చే కాలుష్యంపై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టేందుకు 24 గంటల గడువు విధించింది. రేపు మరోసారి ఈ విషయంపై విచారణ చేపట్టనుంది కోర్టు.


ఒకవేళ గడువులోపు చర్యలు చేపట్టకుంటే.. సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని (Supreme court warning to Centre, Delhi Govt) హెచ్చరించింది.


స్కూళ్లు తెరవడంపై ఆగ్రహం..


కాలుష్యం వల్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో స్కూళ్లు తెరవాలన్న నిర్ణయంపై.. సుప్రీం కోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై అగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా ఉద్యోగులకే వర్క్​ ఫ్రం హోం ఇచ్చినప్పుడుప.. పసి పిల్లలను పాఠశాలలకు రమ్మనడం ఏమిటని ప్రశ్నించింది.


24 గంటలూ పని చేస్తున్నాం..


వాయుకాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను మూసివేయించినట్లు కేంద్రం తరఫున సుప్రీం కోర్టకు వివరించారు సొలిసిటరీ జనరల్​ తుషార్ మెహతా. ఈ వివరాలను ఢిల్లీ ప్రభుత్వానికి ఇచ్చినట్లు పేర్కొన్నారు.


కాలుష్య నియంత్రణకు జెట్​ స్పీడప్​లో.. అధికారులు 24 గంటలూ పని చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు తుషార్​ మెహతా.


అయితే తమకు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకున్నట్లు కనిపించడం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.


Also read: Jawad Cyclone Effect: జవాద్ తుపాను ప్రభావంతో 95 రైళ్లను రద్దు చేసిన ఈస్ట్‌కోస్ట్ రైల్వే


Also read: Omicron scare: ఒమిక్రాన్ భయాలు- ఎయిర్​పోర్ట్​లలో కఠిన కొవిడ్ నిబంధనలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook