All the passengers coming from 'at-risk' countries will have to compulsorily undergo RT-PCR tests: ప్రపంచాన్ని కరోనా ఒమిక్రాన్ వేరియంట్ భయాలు వెంటాడుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి సారించింది. దీనితో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ అంతర్జరాతీయ విమానాశ్రయాల్లో కొవిడ్ టెస్ట్‌లకోసం (Omicron scare in India) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు ఆర్-టీపీసీఆర్ టెస్ట్ తప్పనిసరి (RT-PCR test compulsorily at Airports) చేసింది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు టెస్ట్ రిజల్డ్ వచ్చే వరకు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండాలని కూడా అధికారులు స్పష్టం చేశారు.
ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాట్లు..
అంతర్జాతీయ విమానాల రాకపోకలు అధికంగా ఉండే.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. అధిక రిస్క్ ఉన్న దేశాలతో పాటు.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వేచి ఉండేలా చర్యలు చేపట్టింది. ఒకేసారి 1,500 మందికి విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ఏర్పాట్లు (COVID rules at Delhi airport) చేసింది. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ ఫలితాలు వచ్చే వరకు అక్కడే ఉండేలా నిబంధన విధించింది.
ఒక్కో ప్యాసింజర్ నుంచి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం రూ.1,700 వసూలు చేస్తున్నట్లు ఢిల్లీ ఎయిర్పోర్ట్ వర్గాల వెల్లడించాయి. ఈ ఛార్జీలు ఆర్టీపీసీఆర్ టెస్టు సహా.. ఎయిర్‌పోర్ట్‌ల ఉన్నంత వరకు వారికి ఫుడ్, వాటర్ సప్లయి వంటి అవసరాలకు కూడా అని వెల్లడించాయి. ప్రయాణికులంతా భౌతిక ధూరం పాటించడం తప్పనిసరి అనే నిబంధన కూడా విధించింది.
ముంబయిలో ఇలా..
ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్ రూల్స్ ఇంకా కఠినతరం చేశారు అధికారులు. దేశీయ ప్రయాణికులకు కూడా ఆర్టీపీసీఆర్ టెస్టులు తప్పనిసరి (COVID rules at Mumbai airport) చేసింది. 72 గంటలలోపు ఆర్టీపీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ ఉంటేనే ముంబయి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చేందుకు అనుమతి నచ్చింది.
ఏదైనా అత్యవసరం వల్ల టెస్టు చేయించుకోకుంటే.. ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన వెంటనే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ తప్పనిసరిగా చేయించుకోవాలని స్పష్టం చేసింది.
కర్ణాటక కరోనా రూల్స్..
కర్ణాటకకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులందరికి కొవిడ్ టెస్ట్ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ప్రతి రోజూ దాదాపు 2500 మంది వరకు విదేశాల నుంచి కర్ణాటకకు వస్తున్నారని ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై వెల్లడించారు. అందులో ఎక్కువ మంది బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు రాగా.. కొంత మందు మంగళూరు ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నట్లు తెలిపారు.
గతంలో జరిగిన అనుభావ్ని దృష్టిలో ఉంచుకుని.. కొవిడ్ రూల్స్ కఠినంగా పాటించాలని స్పష్టం (COVID rules at Karnataka) చేశారు. అంతర్జాతీయ ప్రయాణికులపై నిఘా కూడా కొనసాగుతుందని తెలిపారు.
తమిళనాడులో కఠిన నిబంధనలు..
డిసెంబర్ 1 నుంచి చెన్నై అంతర్జాతీయ విమనాశ్రయంలో కఠిన కొవిడ్ రూల్స్ అమలవుతున్నాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు ఆర్టీ- పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి (COVID rules at Chennai airport) చేసింది.
అంతర్జాతీయ ప్రయాణికులు కొవిడ్ నెగెటివ్ వచ్చిన తర్వాతే.. ఎయిర్పోర్ట్ వీడేందుకు అనుమతినిస్తున్నట్లు తెలిపింది.
కేరళలో క్వారంటైన్..
కేరళ ప్రభుత్వం రిస్క్ ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వస్తున్న వారికి క్వారెంటైన్ తప్పనిసరి చేసింది. 14 రోజులు క్వారంటైన్లో ఉండాలని తెలిపింది.
ఎవరికైనా పాజిటివ్‌గా తేలితే.. హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించనున్నట్లు వివరించింది.
భోపాల్‌లో ఆర్టీపీఆర్ తప్పనిసరి..
భోపాల్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ప్రతి ఒక్కరు ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి నిబంధనగా పెట్టింది మధ్య ప్రదేశ్ ప్రభుత్వం.
ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే వారు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలో కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకునే వీలుందని తెలిపింది.
Also read: Corona cases in India: దేశంలో స్థిరంగా కరోనా కేసులు- కొత్తగా 9,765 మందికి పాజిటివ్
Also read: Covishield booster dose: త్వరలో బూస్టర్ డోసుగా కోవిషీల్డ్?.. డీసీజీఐని కోరిన సీరమ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook