Supreme court youtube channel: దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టుకే హ్యాకర్లు బిగ్ షాక్ ఇచ్చారు. ఏకంగా సుప్రీంకోర్టు అఫిషియల్ యూట్యూబ్ ను హ్యాక్ చేసిన ఘటన చోటు చేసుకుంది. దీంతో అధికారులు ఒక్కసారిగా నివ్వేరపోయారు. ఈ క్రమంలో.. క్రిప్టో కరెన్సీనీ ప్రమోట్ చేస్తున్నట్లు కూడా వీడియోలను పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో  పోలీసులు విచారణ ప్రారంభించారు. యూఎస్ కు చెందిన రిపిల్ ల్యాబ్స్ కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ ఆర్పీని ప్రమోట్ చేస్తున్నట్లు కూడా వీడియోలు కన్పిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదిలా ఉండగా.. సుప్రీం కోర్ట్ అఫిషియల్..  YouTube ఛానెల్ సాధారణంగా ముఖ్యమైన కేసుల ప్రత్యక్ష ప్రసారాలను ప్రసారం చేయడానికి ఉపయోగింస్తుంటారు. ముఖ్యంగా.. రాజ్యాంగ బెంచ్‌ల ముందు లేదా ప్రజా ప్రయోజన విషయాలపై విచారణలు జరుగుతున్నప్పుడు అధికారిక యూట్యూబ్ ఛానెల్ ను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో ఏకంగా సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ మాత్రం ప్రస్తుతం.. హ్యాక్ గురవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


Read  more: Viral video: వామ్మో.. ఒళ్లుగగుర్పొడిచే ఘటన.. కొండ చిలువను చీల్చి చెండాడిన మొసలి.. వైరల్ గా మారిన వీడియో..


దీనిపై పోలీసులు, ఐటీ నిపుణులు రంగంలోకి దిగి విచారణ ప్రారంభిచారు.  ఇటివల హ్యకర్లు చాలా మారుతున్న టెక్నాలజీ ప్రకారం అప్ డేట్ అవుతూ మరీ హ్యాకింగ్ లకు పాల్పడుతున్నాయి. దీంతో ప్రజలు మాత్రం.. చాలా మంది హ్యాకర్ల విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశం అత్యున్నత ధర్మాసం.. అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కు గురైతే.. సాధారణ ప్రజల పరిస్థితులేందని కూడా  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.