Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన కొనసాగుతోంది. తాజా వెదర్ రిపోర్ట్‌ను వాతావరణ శాఖ వెల్లడించింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ఆవర్తనం, ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య విస్తరించి కేంద్రీకృతమైంది. ఇటు ఉత్తర-దక్షిణ ద్రోణి ..ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కొమరం ప్రదేశం వరకు విస్తరించింది.
సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థితరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రాగల మూడురోజులపాటు వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో కొన్నిచోట్ల రాగల మూడురోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, ఎల్లుండి తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడనున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
మరోవైపు ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావం తీరం వెంట అధికంగా కనిపిస్తోంది. రాగల మూడురోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి, విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర,రాయల సీమ జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి. రేపు, ఎల్లుండి మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. పలు జిల్లాల్లో రెయిన్ అలర్ట్ ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారాయి. కృష్ణ, గోదావరి, తుంగభద్ర నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీల్లోకి వరద నీరు పోటెత్తింది. దీంతో కొన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇటు గోదావరి సైతం పరవళ్లు తొక్కుతోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. లోతట్టు ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు.
Also read:అలా జరగడంతోనే సాయిరామ్ మృతి.. అండగా నిలబడతామంటూ ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook