తమిళనాడులోని విల్లూపురం జిల్లాలో నీట్‌ 2018కు అర్హత సాధించలేదని 17 ఏళ్ల అమ్మాయి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంటన్స్ టెస్ట్ (నీట్) ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విల్లుపురం జిల్లా పెరువల్లూర్ గ్రామంలో నివసిస్తున్న ఎస్. ప్రతిభ 12వ తరగతి పరీక్షల్లో 1200కు 1125 మార్కులు వచ్చాయి. కానీ నీట్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఫలితాలను ప్రకటించిన తర్వాత ప్రతిభ చాలా బాధపడింది. ఆమె తల్లిదండ్రులు, చుట్టుప్రక్కల వారు బాధపదవద్దని, ఆందోళన చెందవద్దని ఆమెకు చెప్పారు. కానీ సోమవారం రాత్రి ఇంట్లోని ఎలుకల మందు సేవించి ఆత్మహత్య చేసుకుంది. ఆమెను తిరువన్నమలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని మృతిపై నటుడు రజినీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


సోమవారం ఫలితాలు విడుదలైన తరువాత ఢిల్లీలో నీట్ అభ్యర్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఢిల్లీలోని ద్వారకా సెక్టార్లో ఓ భవనం 8వ అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.