చెన్నై : తమిళనాడులో డీఎంకే పార్టీలో విషాదం చోటుచేసుకుంది. రాష్ట్ర మాజీ మంత్రి, డీఎంకే ఎమ్మెల్యే కేపీపీ సామీ గురువారం (ఫిబ్రవరి 27న) ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి కిడ్నీ ఫెయిల్, ఇతరత్రా అనారోగ్య సమస్యలతో సతమతవుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆరోగ్యం విషమించడంతో నివాసంలోనే కేపీపీ సామీ తుదిశ్వాస విడిచారని డీఎంకే అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు టీకేఎస్ ఎలంగోవన్ తెలిపారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి 


మంత్రిగా పని చేసిన నేత కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మృతిపట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. డీఎంకే నేతలు సామీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేపీపీ సామీ ప్రస్తుతం తిరువొట్టివూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2006-2011 మధ్య కాలంలో డీఎంకే ప్రభుత్వంలో మత్స్య సంవర్ధకశాఖ మంత్రిగా సేవలందించారు.


Also Read: తల్లా.. పెళ్లామా.. తేల్చుకోండి: అనసూయ


Also Read: తనకంటే 37 ఏళ్లు పెద్ద వ్యక్తితో నటి రిలేషన్


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..