Minister Senthil Balaji: తమిళనాడు గవర్నర్ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం నుంచి సెంథిల్ బాలాజీ తొలగింపు
Senthil Balaji Dismissal: తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేబినెట్ నుంచి సెంథిల్ బాలాజీని తొలగిస్తూ.. గవర్నర్ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. అయితే మళ్లీ ఆ ఉత్తర్వులకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు.
Senthil Balaji Dismissal: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సెంథిల్ బాలాజీని కేబినెట్ నుంచి తొలగించారు. అయితే అటార్నీ జనరల్ (ఏజీ) సంప్రదింపులు చేస్తామంటూ ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. సీఎం ఎంకే స్టాలిన్‌కు అర్థరాత్రి పంపిన లేఖలో సెంథిల్ బాలజీ తొలగింపునకు సంబంధించి అటార్నీ జనరల్‌ను సంప్రదించి న్యాయ సలహా తీసుకుంటామని గవర్నర్ తెలిపారు.
అన్నాడీఏంకే ప్రభుత్వంలో సెంథిల్ బాలాజీ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. 2011 నుంచి 2016 మధ్య కాలంలో మంత్రిగా పనిచేసిన ఆయన.. ఉద్యోగాల పేరుతో డబ్బులు తీసుకుని మోసం చేశారని ఈడీ కేసులు నమోదు చేసింది. ఇటీవల మంత్రి నివాసాల్లో, కార్యాలయాల్లో దాడులు నిర్వహించింది. అనంతరం మంత్రిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచగా.. జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ప్రస్తుతం ఈ కేసుపై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.
ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకోవడం.. మనీలాండరింగ్‌తో సహా అనేక అవినీతి కేసుల్లో సెంథిల్ బాలాజీ తీవ్రమైన క్రిమినల్ చర్యలు ఎదుర్కొంటున్నారని రాజ్ భవన్ అధికారిక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం మంత్రి పదవిని దుర్వినియోగం చేస్తూ విచారణకు ఆటంకం కలిగిస్తున్నారని పేర్కొంది. న్యాయం జరగకుండా అడ్డుకుంటున్నారని గవర్నర్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే మంత్రి వర్గం నుంచి తొలగిస్తూ.. అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే ఏజీతో సంప్రదింపులు చేస్తామంటూ ముందుగా జారీ చేసిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపి వేశారు.
గవర్నర్ ఆదేశాలపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రివర్గం నుంచి ఏ మంత్రిని తొలగించే హక్కు గవర్నర్ రవికి లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం దీనిని న్యాయపరంగా సవాలు చేస్తుందని చెప్పారు. సెంథిల్ బాలజీని మంత్రివర్గం నుంచి తొలగించడాన్ని బీజేపీ మినహా ఇతర ప్రతిపక్షాలు అన్ని ఖండించాయి. గవర్నర్ తీసుకున్న నిర్ణయం రాజ్యంగ విరుద్ధమని పేర్కొన్నాయి. జూన్ 14న సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్ట్ చేసింది. అయినా ఆయనను మంత్రివర్గంలో కొనసాగించారు సీఎం స్టాలిన్. అయితే సెంథిల్‌కు కేటాయించిన విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలను ఆర్థిక శాఖ మంత్రి తంగం తెన్నరసుకు అప్పగించారు. ప్రస్తుతం సెంథిల్ బాలజీకి వద్ద ఎలాంటి శాఖలు లేవు.
Also Read: Ambati Rayudu News: రాజకీయ రంగ ప్రవేశంపై అంబటి రాయుడు కీలక ప్రకటన
Also Read: Nagarjuna New Car: కొత్త కారు కొనుగోలు చేసిన నాగార్జున.. ధర ఎంతో తెలుసా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి