చెన్నై : తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. బాణాసంచా తయారీ కర్మాగారంలో భారీ పేలుళ్లు సంభవించడంతో 9 మంది మరణించారు. క‌డ‌లూరు జిల్లా కాట్టుమ‌న్నూర్ కోయిల్‌లో శుక్రవారం ఈ పేలుళ్లు సంభ‌వించాయి. తీవ్ర గాయాలపాలైన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు కడలూరు ఎస్పీ తెలిపారు. SBI: ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్‌


సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంటల్ని అదుపు చేసినట్లు సమాచారం. దీపావళి పండుగకు బాణాసంచా తయారు చేస్తుంటే ఒక్కసారిగా పేలుడు సంభవించింది. భారీ శబ్దంతో పేలుళ్లు సంభవించడంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే 
Natasa Stankovic Hot Pics: మోడల్ నటాషా స్టాన్‌కోవిక్ ఫొటోస్