SBI: ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్‌

తమ ఖాతాదారుల భద్రత కోసం అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (State Bank of India) చర్యలు తీసుకుంటోంది. ఏటీఎం కార్డు మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Last Updated : Sep 4, 2020, 02:58 PM IST
  • స్టేట్ బ్యాంకు ఖాతాదారుల కోసం సరికొత్త ఫీచర్
  • బ్యాలెన్స్, మిని స్టేట్‌మెంట్ చెక్ చేస్తే మొబైల్‌కు SMS అలర్ట్
  • ఏటీఎంలో ఉన్నది కాదంటే వెంటనే కార్డు బ్లాక్ చేయడమే
SBI: ఖాతాదారుల కోసం ఎస్‌బీఐ సరికొత్త ఫీచర్‌

న్యూఢిల్లీ : తమ ఖాతాదారుల భద్రత కోసం అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (State Bank of India) చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా ఏటీఎం కార్డులతో మోసాలు జరుగుతుంటాయి. ఈ మోసాలను అరికట్టేందుకు ఎస్‌బీఐ ఓ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా ఏటీఎం కార్డుతో బ్యాలెన్స్ చెక్ చేసినా, లేక మిని స్టేట్‌మెంట్ చెక్ చేసినా ఆ బ్యాంకు ఖాతాతో రిజిస్టర్ అయిన మొబైల్‌ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. Ravichandran Ashwin: జీవితంలో అవి అత్యంత చెత్త రోజులు 
 మోడల్ Padma Lakshmi 50వ బర్త్‌డే.. బికినీ ఫొటోలతో ట్రీట్ 

ఒకవేళ మీరు ఎక్కడో ఉన్నా.. ఏం ట్రాన్సాక్షన్ చేయకున్నా.. మీకు ఈ మెస్సేజ్ అలర్ట్ వచ్చిందంటే వెంటనే మీ డెబిట్ కార్డును బ్లాక్ చేసుకోవాలి. ఏటీఎం కార్డుల మోసాలను కొంతలో కొంతైనా తగ్గించేందుకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు.  Gold Price: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త

ఇకనుంచి మీకు స్టేట్ బ్యాంకు ఖాతాలకు సంబంధించి మెస్సేజ్ అలర్ట్స్ వస్తే లైట్ తీసుకోకుండా అలర్ట్ అవ్వాలని.. వెంటనే మీ ఏటీఎం ఖాతాను బ్లాక్ చేయాలని బ్యాంకు అధికారులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ మధ్య కార్డ్‌లెస్ క్యాచ్ విత్‌డ్రా సౌకర్యాన్ని సైతం బ్యాంకు తమ ఖాతాదారులకు కల్పించింది. Metro New Timings: హైదరాబాద్ మెట్రో రైలు కొత్త మార్గదర్శకాలు.. ట్రైన్ టైమింగ్స్ ఇవే 
Natasa Stankovic Hot Pics: మోడల్ నటాషా స్టాన్‌కోవిక్ ఫొటోస్

Trending News