Tamil Nadu: తమిళనాడులో విషాదం నెలకొంది. తిరునల్వేలి జిల్లా మునీర్‌ పల్లంలోని క్వారీలో బండరాళ్లు పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని వెలికి తీశారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. క్వారీలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో బండరాళ్లు మీద పడ్డాయి. దీంతో సుమారు ఆరుగురు శిథిలాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగి అధికారులు క్వారీ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ షురూ చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మిగిలిన వారి కోసం సహాయకచర్యలు కొనసాగుతోంది.  మరోవైపు ఘటనపై స్టాలిన్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. క్వారీని వెంటనే మూసివేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఆర్థిక సాయం మొత్తంలో రూ.10 లక్షలను ప్రభుత్వం అందిస్తుందని..మిగిలిన ఎక్స్‌గ్రేషియాను వెల్ఫేర్ బోర్డు అందిస్తుందని అధికారులు తెలిపారు. 


మునీర్ పల్లం క్వారీలో రాత్రి సమయంలో పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో పనులు జరగడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. నిబంధనలు పాటించని క్వారీలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. 


Also read:North Korea Corona: ఉత్తర కొరియాలో మాయదారి వైరస్ విజృంభణ..వణికిపోతున్న ప్రజలు..!


Also read:Shikhar Dhawan: వెండి తెరపైకి మరో స్టార్ క్రికెటర్‌ రాబోతున్నారా..? నిజమెంత..?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook