తమిళనాడులో పౌరసత్వ  సవరణ చట్టం-CAA-2019 కు వ్యతిరేకంగా ఆందోళనలు ఉద్ధృతంగా జరుగుతున్నాయి. విపక్ష పార్టీ డీఎంకే సహా మిగతా రాజకీయ పార్టీలు రోజూ రోడ్లపై ఆందోళనలు చేస్తూనే ఉన్నాయి. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ కూడా నిత్యం నిరసన ప్రదర్శనల్లో పాల్గొంటోంది. సోషల్ డెమొక్రాటిక్ పార్టీ ఆందోళనలో ప్రముఖ తమిళ రచయిత నెల్లయ్ కన్నన్ పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ప్రసంగం చేసిన ఆయన ప్రధాని  నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాపై  అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై తమిళనాడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.  అనంతరం పెరంబలూర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న నెల్లయ్ కన్నన్ ను పోలీసులు అరెస్టు చేశారు.



  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..