Tamilnadu: తమిళనాడులో మరో కొత్త పథకం, ఇంటి వద్దకే దంత వైద్య సేవలు, విద్య
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాల్లో వైఎస్ జగన్‌తో పోటీ పడుతున్న స్టాలిన్ ఈసారి ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
Tamilnadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరో కొత్త పథకం ప్రవేశపెట్టారు. సంక్షేమ పథకాల్లో వైఎస్ జగన్‌తో పోటీ పడుతున్న స్టాలిన్ ఈసారి ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవలకు శ్రీకారం చుట్టారు. ఆ వివరాలేంటో పరిశీలిద్దాం.
తమిళనాడు(Tamilnadu)ముఖ్యమంత్రిగా బాథ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఎంకే స్టాలిన్(Mk Stalin)వినూత్న పథకాలు ప్రవేశపెడుతున్నారు. సంక్షేమ పథకాల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పోటీ పడుతున్నారు. ఇప్పుడు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టారు. ఈసారి ఇంటింటికీ విద్య, దంత వైద్య సేవా పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. చెన్నైలో తొలి విడతగా మొబైల్ దంత వైద్య సేవలను రాష్ట్ర ఆరోగ్యమంత్రి సుబ్రమణియన్ ప్రారంభించారు. అందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చెన్నైలో తొలిసారిగా ప్రజల వద్దకే దంత వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. దీనికోసం అన్నిరకాల వసతులతో ప్రత్యేకంగా మొబైల్ వాహనం సిద్ధమైంది.
ప్రజల వద్దకే దంతవైద్య సేవల్ని(Dental services at door step)దశలవారీగా రాష్ట్రమంతా విస్తరిస్తామని మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. మరోవైపు ప్రతి శనివారం మెగా వ్యాక్సినేషన్ క్యాంప్(Mega Vaccination camp)ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదివారం వ్యాక్సిన్ క్యాంపు కారణంగా మాంసం, మందు ప్రియులు వ్యాక్సినేషన్‌కు ముందుకు రావడం లేదనేది నిజమేనన్నారు. ఆ తప్పుడు ప్రచారం కారణంగా వ్యాక్సినేషన్ ప్రక్రియకు విఘతం కలగకుండా ఉండేందుకు శనివారానికి మార్చామన్నారు. రాష్ట్రంలో 50 వేల వ్యాక్సిన్ శిబిరాల్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 53 లక్షల వ్యాక్సిన్ డోసులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు ఇంటి వద్దక విద్య నినాదాన్ని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్ధులకు ఇంటి వద్దకే విద్యను(Education at Door Step) అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్(Mk Stalin)సంబంధిత అధికారులతో చర్చించారు. నవంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలల్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. 9, 10,11,12 విద్యార్ధులకు ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభం కానున్నాయి.
Also read: Wine Car: ఆ కారు వైన్ తాగితేనే ముందుకెళ్తోందిట..నిజమేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి