Tamilnadu Assembly Elections: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్స్‌కు వెళ్తోంది. అన్నాడీఎంకే పార్టీ పొత్తుతో తమిళనాట బరిలో దిగిన బీజేపీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ఒకప్పుడు కలిసి జీవించిన గౌతమి, కమల్ హాసన్‌లు ఈ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా ప్రచారం నిర్వహించనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు అసెంబ్లీ ఎన్నిక ( Tamilnadu Assembly Elections)ల్లో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా ( Bjp Star Campaigners list) విడుదల చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రహోంమంత్రి అమిత్ షా , ఇతర కేంద్ర మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, నిర్మలా సీతారామన్, యోగీ ఆదిత్యనాధ్, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ సహా ఇతర ప్రముఖులు జాబితాలో ఉన్నారు. తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ (Aiadmk-Bjp) కూటమి సీట్ల కేటాయింపులో భాగంగా బీజేపీకు 20 స్థానాలు దక్కాయి. రాజకీయ నేతలతో పాటు ప్రముఖ నటి, బీజేపీ నేత గౌతమి కూడా స్టార్ క్యాంపెయినర్‌గా  ఉన్నారు. 


రాజపాళయం సీటు నుంచి పోటీ చేద్దామని భావించిన గౌతమి ( Gouthami) కి నిరాశే ఎదురైంది. ఆ సీటు కాస్తా అన్నాడీఎంకేకు కేటాయించడంతో ఆమె పోటీ చేయలేకపోతోంది. అయితే స్టార్ క్యాంపెయినర్‌గా ఆమె సేవలు వినియోగించుకోవాలని బీజేపీ అధిష్టానం భావించడంతో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకోనున్నాయి. ఎందుకంటే ఇదే ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) సొంతపార్టీతో రంగంలో ఉన్నారు. కమల్ హాసన్ , గౌతమి ఒకప్పుడు కలిసి చాలా సినిమాల్లో నటించారు. అంతేకాదు 13 ఏళ్ల పాటు సహజీవనం కూడా సాగించారు. విబేధాల కారణంగా 2016లో విడిపోయారు. ఇప్పుడు ప్రత్యర్ధిపార్టీల్లో ప్రచారంలో కన్పించనున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇతరుల ప్రచారపర్వం ఎలా ఉన్నా..కమల్ హాసన్ వర్సెస్ గౌతమి ఆసక్తిగా ఉండనుంది. కమల్ హాసన్‌కు నటులు శరత్ కుమార్, రాధికల సంపూర్ణ మద్దతు ఉంది. 


Also read: Covid vaccination: మాకు అప్పగిస్తే మూడు నెలల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేస్తాం: అరవింద్ కేజ్రీవాల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook