Tamilnadu: దేశంలో కరోనా మారణహోమం సృష్టిస్తూనే ఉంది. ప్రాణవాయువు అందక ప్రాణాలే పోతున్నాయి. దేశంలో కరోనా పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. తమిళనాడులో పరిస్థితి అందుకు ఉదాహరణ..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. భారీగా కేసులు నమోదయ్యే కొద్దీ పరిస్థితులు దిగజారుతున్నాయి. ఓ వైపు ఆక్సిజన్ కొరత వెంటాడుతోంది. మరోవైపు అత్యవసర మందులు, బెడ్స్ లభించడం లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి. దేశంలో కరోనా పాజిటివా్ కేసులు కూడా భారీగా పెరుగుతుండటంతో ఆందోళన రేగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ అందక రోగులు ప్రాణాలు కళ్లముందే పోవడం అందరికీ తెలిసిందే. 


ఇప్పుడు అదే పరిస్థితి తమిళనాడు(Tamilnadu) లో మొదలైంది. రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని చెంగల్పట్టు ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా బాధితులు మరణించారు. ఇప్పటికీ ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత తీవ్రంగానే ఉంది. ఆక్సిజన్ ట్యాంక్ ఖాళీ అయిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. ఆక్సిజన్‌ సరఫరా (Oxygen Shortage) లేకపోవటంతో మరికొంత మంది కరోనా పేషెంట్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆక్సిజన్‌ తెప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదు గంటల ముందే ఆక్సిజన్‌ లేదని చెప్పినా వైద్యులు పట్టించుకోలేదని కరోనా బాధితుల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవల మహారాష్ట్ర, ఢిల్లీలో ఎదురయ్యాయి.


Also read: Tamilnadu: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కంటే ముందే వరాలు కురిపిస్తున్న స్టాలిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook