Tamilnadu: తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టకుండానే ప్రభుత్వ పాలన ప్రారంభించేశారు ఎంకే స్టాలిన్. కాంట్రాక్ట్ ఉద్యోగులపై వరాలు కురిపించారు. కరోనా పరిస్థితులపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamilnadu Assembly Elections) విజయం సాధించిన డీఎంకే త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎంకే స్టాలిన్ ( Mk Stalin) ప్రభుత్వ పాలన ప్రారంభించారు. కరోనా పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తమిళనాడు ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న 1212 మంది నర్శుల ఉద్యోగాల్ని పర్మినెంట్ చేయనున్నట్టు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. గత కొద్దికాలంగా కాంట్రాక్టు నర్శులు ఇదే అంశంపై ఆందోళన, ధర్నాలు చేస్తున్నారు. 


రాష్ట్రంలో కరోనా మహమ్మారి (Coronavirus) విజృంభిస్తున్న తరుణంలో వైద్యులు, నర్శులు, ఇతర సిబ్బంది సేవలు చాలా ఉపయోగమవుతున్నాయి. అంకితభావంతో కరోనా విధులు నిర్వర్తించాలని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు తమిళనాడులోని జర్నలిస్తుల్ని ఫ్రంట్‌లైన్ వారియర్లుగా పరిగణిస్తామని స్టాలిన్ తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాల్ని పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల సేవల్ని కొనియాడారు.జర్నలిస్టులకు తగిన రాయితీలు కల్పిస్తామన్నారు.


Also read: Mamata Banerjee Oath: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణ స్వీకారం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook