తమిళనాడులో మంత్రివర్గంలో త్వరలో కీలకమార్పు చోటుచేసుకోనుంది. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి తనయుడు, సినీ నటుడైన ఉదయనిధికి చోటు దాదాపు ఖరారైంది. ఆ వివరాలు మీ కోసం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళనాడు ప్రభుత్వంలో కీలక మార్పు జరగనుంది. ఆ రాష్ట్ర పాలనలో ఇప్పుడు ముఖ్యమంత్రి తనయుడు స్టాలిన్ చేయూత అందించనున్నాడు. మంత్రివర్గంలో స్టాలిన్ తనయుడు, ఎమ్మెల్యే ఉదయనిధికి చోటు దాదాపు ఖరారైంది. కుటుంబపార్టీ ఆరోపణల్ని పక్కనబెట్టి..ఉదయనిధికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తున్నారు. చెపాక్ తిరువల్లికేని నియోజకవర్గం నుంచి 2021 లో ఎమ్మెల్యేగా గెలిచిన ఉదయనిధిగా ప్రస్తుతం ఏ పదవిలోనూ లేరు. డిసెంబర్ 14న మంత్రివర్గంలో చేరనున్నట్టు సమాచారం.


ఉదయనిధి స్టాలిన్‌ను తీసుకోవడమే కాకుండా అదే రోజు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేసే అవకాశాలున్నాయి. ఉదయనిధి మంత్రి కావాలని పార్టీ నేతలు చాలాకాలంగా కోరుకుంటున్నారని...అయితే అదంతా ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని డీఎంకే అధికార ప్రతినిధి రవీంద్రన్ తెలిపారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న ఉదయనిధికి..యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ అప్పగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై అన్నాడీఎంకే కార్యదర్శి పళనిస్వామి మాత్రం స్పందించారు. డీఎంకే కుటుంబపార్టీగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. 


Also read: 2000 Rupee Note Ban: 2 వేల రూపాయల నోటు బ్యాన్ చేయనున్నారా, రాజ్యసభలో ఎందుకు చర్చ



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook