Kamal haasan party: ఎన్నికల నగారా మోగడంతో తమిళనాట కీలక పరిణామాలు
Kamal haasan party: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపధ్యంలో తమిళనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పొత్తులు, కూటములు ఏర్పాటవుతున్నాయి.
Kamal haasan party: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగడంతో తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపధ్యంలో తమిళనాట ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా పొత్తులు, కూటములు ఏర్పాటవుతున్నాయి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల( Tamilnadu Assembly Elections)కు షెడ్యూల్ విడుదలైంది. నిన్నటి వరకూ సాధారణంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు వేగం పెంచాయి. విజయమే పరమావధిగా పొత్తులు, కూటమిల ఏర్పాటులో నిమగ్నమయ్యాయి. మక్కల్ నీది మయ్యం ఎంఎన్ఎం పార్టీ వ్యవస్థాపకుడైన కమల్ హాసన్( Kamal haasan) ఈ విషయంలో కీలకంగా ఉన్నారు. మరో నటుడు ఆలిండియా సమతువ మక్కల్ కట్చి ఏఐఎస్‌ఎంకే అధినేత శరత్ కుమార్( Sarat kumar)తో కమల్ హాసన్ భేటీ అయ్యారు. మూడవ కూటమి ఏర్పాటుపై ఇరువురూ చర్చించారు. పొత్తులపై చర్చించి ఏకాభిప్రాయానికి వచ్చారు. బేటీ అనంతరం మీడియాకు కీలక విషయాలు వెల్లడించారు.
తమిళనాడులో మూడవ కూటమి ( Third alliance in tamilnadu)ఏర్పాటు చేస్తున్నామని కమల్ హాసన్ తెలిపారు. మూడవ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని తానేనని కూడా స్పష్టం చేశారు. శరత్ కుమార్ తనతో కలిసి రావడం శుభపరిణామమని..ఏ పార్టీ అయినా తమతో కలిసి రావచ్చని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీదిమయ్యంతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని శరత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే ఇండియా జననాయగ కట్చి పార్టీతో తమ పొత్తు ఖరారైందని..ఇప్పుడు మక్కల్ నీదిమయ్యంతో పొత్తు కూడా ఖరారు కావడంతో మూడు పార్టీలు కలిసి కూటమిగా ఉంటాయన్నారు. ఇప్పటివరకూ అన్నాడీఎంకే( Aiadmk) మిత్రపక్షంగా ఉన్న శరత్ కుమార్ పార్టీ కమల్ హాసన్ పార్టీతో చేరడంతో..అధికారపార్టీతో బంధం తెగిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook