Teachers Day 2022: టీచర్స్ డే వచ్చేస్తోంది. మీకిష్టమైన గురువులను గుర్తు చేసుకోవడం లేదా కలిసి శుభాకాంక్షలు అందించడంతో పాటు ఎలాంటి బహుమతులు ఇవ్వవచ్చో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీచర్స్ డే. చదువు చెప్పిన గురువుల దినోత్సవం. సెప్టెంబర్ 5 టీచర్స్ డే సోమవారం వచ్చింది. మీ గురువులపై మీకుండే భక్తి, ప్రేమను చాటుకునేందుకు ఓ మంచి సందర్భం. మిమ్మల్ని తీర్చిదిద్దడంలో టీచర్లు చేసిన కృషిని గుర్తించే సందర్భం కూడా. మీ టీచర్లకు కృతజ్ఞతలు చెప్పుకునేందుకు మంచి అవకాశం. ఇండియాలో ప్రతియేటా సెప్టెంబర్ 5న టీచర్స్ డే జరుపుకుంటాం. 


టీచర్స్ డే నేపధ్యం


మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు సెప్టెంబర్ 5. 1988 సెప్టెంబర్ 5న జన్మించిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు వృత్తిరీత్యా టీచర్. ఆ వృత్తిపై ఆయనకున్న ప్రేమ, అంకితభావం కారణంగా ప్రతియేటా ఆయన పుట్టినరోజుని టీచర్స్ డేగా జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనొక పండితుడు. రాజకీయవేత్త, టీచర్. 


మనల్ని తీర్చిదిద్దేందుకు టీచర్లు చాలా శ్రమపడుతుంటారు. విలువైన సమయాన్ని వెచ్చిస్తుంటారు. మన కోసం టీచర్లు పడిన ఆ శ్రమకు కృతజ్ఞతలు తెలుపుకునే సందర్భం వచ్చింది. మరి ఈ అరుదైన సందర్భాన టీచర్లను ఎలా గౌరవించుకోవాలి, ఎలాంటి బహుమతులిస్తే బాగుంటుందో పరిశీలిద్దాం..


మగ్, చాకొలెట్, పెన్, డైరీలు బహుమతిగా ఇచ్చేందుకు బాగుంటాయి. అందరికీ తెలిసిన వస్తువులే అయినా..టీచర్లు ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. లేదా ఏదైనా మంచి పుస్తకాన్ని మీ టీచర్లకు బహుమతిగా ఇస్తే బాగుంటుంది. టీచర్లకు పుస్తకాలంటే ఇష్టం. చాలామంది టీచర్లకు మొక్కలంటే చాలా ఇష్టం. మీ టీచర్లకు కూడా మొక్కలు ఇష్టమైతే..ఇంతకుమించిన బహుమతి ఉండదు. టీచర్ల దినోత్సవం రోజన మంచి కేక్ తీసుకుని వెళ్లవచ్చు.


Also read: MLAS JUMP: ఐదుగురు జేడీయూ ఎమ్మెల్యేలు జంప్.. నితీశ్ కుమార్ కు బీజేపీ షాక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook