Virat Kohli: రైతు చట్టాలకు మద్దతుగా విరాట్ కోహ్లీ, నెటిజన్ల ట్రోలింగ్
Virat Kohli: రైతు చట్టాలు..రైతు ఆందోళన..స్వదేశీ సెలెబ్రిటీలు..విదేశీ సెలెబ్రిటీలు. దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. రైతు చట్టాల విషయంలో ఇప్పుడు కొత్తగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చి చేరాడు.
Virat Kohli: రైతు చట్టాలు..రైతు ఆందోళన..స్వదేశీ సెలెబ్రిటీలు..విదేశీ సెలెబ్రిటీలు. దేశంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. రైతు చట్టాల విషయంలో ఇప్పుడు కొత్తగా టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చి చేరాడు.
గణతంత్ర దినోత్సవం ( Republic day ) నాడు రైతుల ట్రాక్టర్ ర్యాలీ ( Farmers Tractor Rally ), జరిగిన హింస నేపధ్యంలో రైతు ఆందోళన ( Farmers Protest )కొత్త మలుపులు తిరిగింది. రైతులకు బాసటగా కొందరు, చట్టాలకు మద్దతుగా మరి కొందరు నిలిచిన పరిస్థితి. ఇదే సమయంలో సెలెబ్రిటీలు సైతం రెండుగా చీలిపోయారు. అంతర్జాతీయంగా సెలెబ్రిటీలు రైతు ఆందోళనకు మద్దతుగా నిలిచారు. దాంతో దేశీయంగా ఉన్న సెలెబ్రిటీలు రైతు చట్టాల్ని సమర్ధించే పనిలో పడ్డారు. మొన్న అక్షయ్ కుమార్ ( Akshay kumar ), అజయ్ దేవ్‌గణ్ ( Ajay Devgan ), సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar )..ఇప్పుడు టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.
హాలీవుడ్ పాప్ సింగర్ రిహన్నా ( Rihanna ), ప్రపంచ పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్‌బర్గ్ ( Greta Thunberg ), మీనా హారిస్‌లు రైతులకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ( Virat Kohli ) సైతం రైతు చట్టాల ( Farm Laws ) కు మద్దతుగా ట్వీట్ చేసి..ట్రోల్ అవుతున్నాడు. అంతేకాదు ఇండియాటుగెదర్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేశాడు. విభేదాలు తలెత్తిన సమయంలో మనమంతా ఐకమత్యంగా ఉండాలి..రైతులు మనదేశంలో అంతర్భాగం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఉద్రిక్తతల పరిష్కారం కోసం అన్ని పార్టీలు , వర్గాలతో చర్చించి స్నేహపూర్వక పరిష్కారంతో శాంతి నెలకొల్పేందుకు సమైక్యంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు.
విరాట్ కోహ్లీ ( Virat Kohli ) చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. నువ్వు మా కెప్టెన్ కాదు..హిట్ మ్యాన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. రెండు పడవల ప్రయాణం మంచిది కాదు..వివాదాస్పద అంశంలో ఎవరో ఒక్కరికే మద్దతుగా నిలవడం బెటర్ అంటూ కామెంట్లు అందుకున్నారు. రైతుల గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావ్..నీకంటే రిహన్నా ఎంతో నయం అని నెటిజన్స్ ట్రోల్ ( Netizens troll ) చేశారు.
అయితే ఒక విషయం మాత్రం గమనించాలి. రైతుల అంశంపై విదేశీ సెలెబ్రిటీలు స్పందించనంతవరకూ దేశంలోని సచిన్ గానీ, విరాట్ గానీ మాట్లాడకపోవడం గమనార్హం.
Also read: US on New Farm Laws: కొత్త రైతు చట్టాలు..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఎటు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook