Rape case: ఎంత దారుణం.. యువతిపై లవర్, అతడి తండ్రి అత్యాచారం
ప్రేమించిన అబ్బాయి, అతడి తండ్రి చేతిలో ఓ యువతి దారుణంగా మోసపోయిన ఘటన ఇది. ప్రియుడిని ఇచ్చి పెళ్లి చేస్తారని నమ్మి వెళ్లిన యువతిపై ప్రియుడితో పాటు అతడి తండ్రి కూడా అత్యాచారానికి పాల్పడిన ఘటన అస్సాం రాజధాని గువహటిలో చోటుచేసుకుంది. తనకు తన ప్రియుడితో పెళ్లి అవుతుందని నమ్మి వెళ్లినందుకు తనను మోసం చేసి తండ్రీ, కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గువహటి: ప్రేమించిన అబ్బాయి, అతడి తండ్రి చేతిలో ఓ యువతి దారుణంగా మోసపోయిన ఘటన ఇది. ప్రియుడిని ఇచ్చి పెళ్లి చేస్తారని నమ్మి వెళ్లిన యువతిపై ప్రియుడితో పాటు అతడి తండ్రి కూడా అత్యాచారానికి పాల్పడిన ఘటన అస్సాం రాజధాని గువహటిలో చోటుచేసుకుంది. తనకు తన ప్రియుడితో పెళ్లి అవుతుందని నమ్మి వెళ్లినందుకు తనను మోసం చేసి తండ్రీ, కొడుకులు అత్యాచారానికి పాల్పడ్డారు అంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, దిక్కు తోచని పరిస్థితుల్లో తనకు న్యాయం చేయాలని వేడుకుంటూ తాము పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. గత వారం రోజులుగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేయకుండా తాత్సారం చేస్తున్నారని బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎలా జరిగింది ?
గువహటికి చెందిన ప్రీతమ్ నాథ్, 19ఏళ్ల యువతి ప్రేమించుకున్నారు. త్వరలోనే పెళ్లి చేసుకుందాం అని ప్రీతం నాథ్ చెప్పడంతో అక్టోబర్ 8న అతడి ఇంటికి వెళ్లానని.. నవంబర్‌లో పెళ్లి చేస్తామని అబ్బాయి ఇంట్లో వారు చెప్పడంతో అప్పటి నుంచి అక్కడే ఉంటున్నానని బాధితురాలు ( Rape victim ) చెప్పుకొచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి వరకు వేర్వేరు గదుల్లో ఉండాలని సూచించారని.. వారి మాటలు నమ్మి అలాగే వేర్వేరు గదుల్లో ఉంటున్న క్రమంలోనే తండ్రీ, కొడుకులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది.
Also read : kidney sold for iphone: ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడేమో..
పోలీసులు పట్టించుకోవడం లేదని ఉన్నతాధికారులకు ఫిర్యాదు:
నవంబర్ 6న తన తల్లిదండ్రుల వద్దకు తిరిగొచ్చిన బాధితురాలు.. ప్రియుడి ఇంట్లో తనపై జరిగిన అత్యాచారం ( Girl raped by boyfriend and his father ) గురించి తల్లిదండ్రులకు చెప్పుకుని బోరుమంది. తల్లిదండ్రుల సాయంతో పోలీసులను ఆశ్రయించినప్పటికీ.. పోలీసులు నిందితులతో ఏకమై తమ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయినట్టు టైమ్స్ నౌ కథనం పేర్కొంది.
Also read : Women Empowerment: మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి