Women Empowerment: మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?

Special Saving Account For Women | ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఈ ఖాతాల్లో డబ్బు దాచే మహిళలకు 7 శాతం వడ్డీని అందించనుంది బ్యాంకు. ఈ స్పెషల్ సేవింగ్స్ ఖాతా పేరు ఇవా సేవింగ్స్ ఎకౌంట్ ( Eva Savings Account ).

Last Updated : Nov 17, 2020, 07:50 PM IST
    1. ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది.
    2. ఈ ఖాతాల్లో డబ్బు దాచే మహిళలకు 7 శాతం వడ్డీని అందించనుంది బ్యాంకు.
    3. ఈ స్పెషల్ సేవింగ్స్ ఖాతా పేరు ఇవా సేవింగ్స్ ఎకౌంట్.
Women Empowerment: మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?

Equitas Small Finance Bank | ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మహిళల కోసం ప్రత్యేక సేవింగ్స్ ఖాతాను ప్రారంభించింది. ఈ ఖాతాల్లో డబ్బు దాచే మహిళలకు 7 శాతం వడ్డీని అందించనుంది బ్యాంకు. ఈ స్పెషల్ సేవింగ్స్ ఖాతా పేరు ఇవా సేవింగ్స్ ఎకౌంట్ ( Eva Savings Account ).

Also Read | Free BSNL Sim: సిమ్ కార్డును ఉచితంగా ఇవ్వనున్న బిఎస్ఎన్ఎల్

భారత మహిళ క్రికెట్ క్రీడాకారిణి స్మృతి మంధాన ( Smriti Mandhana ) ఈ బ్యాంకుకు బ్రాండ్ ఎంబాసెడర్ గా వ్యవహరిస్తున్నారు.

అందరికీ..

ఈ సందర్భంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఒక ప్రకటనను జారీ చేస్తూ ఇందులో మహిళలందరూ తమ డబ్బును సేవ్ చేసుకోవచ్చు అని తెలిపింది.  ఉద్యోగాలు చేస్తున్న మహిళలు ( Working Women ), గృహిణులు, బిజినెస్ వుమెన్, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్స్ ( Transgender ), నాన్ రెసిడెంట్ మహిళలు ఈవా సేవింగ్ ఖాతా నుంచి లబ్ది పొందవచ్చు.

Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు

ముఖ్యంగా 7 నుంచి 7.25 శాతం వడ్డీతో పాటు ఉచిత ఆరోగ్య పరీక్షలను కూడా మహిళలకు అందించనుంది బ్యాంకు. దాంతో పాటు వైద్యులతో ఎలాంటి పరిమితులు లేకుండా సంప్రదించి వైద్య సేవలు వినియోగించుకోవచ్చు. ఇందులో గైనకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ ల సేవలు కూడా వినియోగించుకోవచ్చు.

మహిళా సాధికారత..

స్మాల్ ఈక్విటాస్ ఫైనాన్స్ బ్యాంకు ( Equitas Small Finance Bank ) అధ్యక్షుడు మురళీ వైద్యానాథన్ ప్రకారం సాధికారత కోసం, ముఖ్యంగా మహిళా సాధికారత కోసం తమ బ్యాంకు ప్రయత్నిస్తోంది అని తెలిపారు. బ్యాంకు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మహిళలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ లభిస్తుంది. వారి సేవలను వినియోగించుకుని మహిళా సాధికారతను సాధించుకోవాలని కోరారు.

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

 

Trending News