CM KCR met Amit Shah: న్యూఢిల్లీ‌: తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (K Chandrashekhar Rao ) రాజధాని ఢిల్లీలో రెండోరోజు పర్యటిస్తున్నారు. మూడు రోజుల (cm kcr delhi tour) పర్యటనలో భాగంగా శుక్రవారం రాత్రి ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ( Home Minister Amit Shah ), కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చాలా రోజులుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీ అయ్యారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రాష్ట్రంలో శాంతి భద్రతలు, రావాల్సిన నిధులు, నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించారు. ముందుగా గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ( Gajendra Singh Shekhawat )తో సమావేశమైన సీఎం కేసీఆర్ ఆతర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.



అయితే రెండో రోజు పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ( CM KCR ).. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi )తోపాటు పలువురు మంత్రులను కలిసే అవకాశం ఉంది. విభజన హామీలతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులను కలిసి చర్చలు జరపనున్నట్లు సమాచారం. Also read: Dress Code for Employees: మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం


 


 Also read: New Rules 2021: కొత్త చట్టాలతో 2021 నుంచి మీ జీతంపై ప్రభావం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook