Telangana Ministers Meeting with Piyush Goyals: తెలంగాణలో పండిన వరిని కొనాలని టీ- సర్కార్, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి.. కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై సోమవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, టీఆర్ఎస్ నేతలతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పండిన వరిని కొనాలని, లేకపోతే ఢిల్లీలో ఉద్యమం చేపడతామని తెలిపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం గురించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలవటానికి తెలంగాణ మంత్రులు అదే రోజు ఢిల్లీకి పయనమయ్యారు. 


ధాన్యం కొనుగోలుపై కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలవడానికి ఢిల్లీ వచ్చిన తెలంగాణ రాష్ట్ర మంత్రుల బృందానికి ఎట్టకేలకు ఆయన అపాయింట్ మెంట్ దొరికింది. ఇందుకోసం వారు పడిగాపులు పడాల్సి వచ్చింది. అనేక ప్రయత్నాల తర్వాత చివరకు ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అపాయింట్‌మెంట్ ఖరారు అయ్యింది. మంత్రులు నిరంజన్‌ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ మంగళవారం రాత్రే ఢిల్లీ వచ్చారు. హస్తినకు రాకమునుపే కేంద్ర మంత్రి అపాంట్‌మెంట్‌ కోసం టీఆర్‌ఎస్‌ పార్లమెంట్ సభ్యులు ప్రయత్నాలు సాగించినట్లు సమాచారం.


మరోవైపు బుధవారం పార్లమెంట్‌ ఆవరణలోనే పీయూష్ గోయల్‌ను ఎంపీలు కే.కేశవరావు, నామా నాగేశ్వరరావు కలిశారు. అపాయింట్ మెంట్ ఖరారు చేయాలని కోరారు. అయితే తనకు ముందే వేరే అపాయింట్‌మెంట్లు ఉన్నాయనీ.. గురువారం కలిసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రి కార్యాలయం నుంచి అపాయింట్‌మెంట్ ఖరారు చేస్తూ సమాచారం అందింది.


అటు ధాన్యం కోసం మంత్రులు మళ్లీ ఢిల్లీ వచ్చారా అంటూ పీయూష్ గోయల్ తనను కలిసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలను ప్రశ్నించినట్లు సమాచారం. గత ఏడాది డిసెంబర్‌లోనూ ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చిచ్చు రేపుతున్న నేపథ్యంలో పీయూష్ గోయల్‌తో మంత్రుల బృందం భేటీ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


Also Read: KGF Chapter 2: కేజీఎఫ్ 2 ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. గెస్ట్‌గా పాన్ ఇండియా స్టార్స్! అభిమానులకు పూనకాలే ఇగ!!


Also Read: Warner vs Shaheen Afridi: ఒకరిపై మరొకరు దూసుకొచ్చిన వార్నర్, అఫ్రిది, అసలేం జరిగింది


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook