CM Kcr Tour: జాతీయ రాజకీయాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫోకస్ చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు నేతలతో మంతనాలు జరిపారు. తాజాగా బెంగళూరుకు వెళ్లిన సీఎం కేసీఆర్..మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలు, తాజా పరిణామాలపై చర్చించారు. బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై మంతనాలు జరిపారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, త్వరలో జరగనున్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతకముందు మధ్యాహ్నం బెంగళూరు చేరుకున్న ఆయన..నేరుగా దేవెగౌడ నివాసానికి వెళ్లారు. అక్కడ సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం లభించింది. సీఎం వెంట ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, జీవన్‌రెడ్డి ఉన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా బెంగళూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. కాసేపట్లో ఆయన తిరిగి బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు.


ఇటీవల ఆయన ఆలిండియా పర్యటనకు శ్రీకారం చుట్టారు. దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడి సీఎం కేజ్రీవాల్‌తో మంతనాలు జరిపారు. ఇద్దరు కలిసి ఢిల్లీ సర్వోదయ స్కూల్‌ను సందర్శించారు. స్కూల్‌ ఆవరణలో పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు కేజ్రీవాల్‌ వివరించారు. ఢిల్లీ విద్య విధానంపై ఆరా తీశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. తెలంగాణలోనూ ఇదే విధానాన్ని తీసుకొస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అంతకముందు ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసంలో ఆయనతో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌ భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. 


బీజేపీ, కాంగ్రెస్‌ యేతర ప్రత్యామ్నాయ కూటమిపై సమాలోచనలు జరిపారు. ఆ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ పంజాబ్‌ వెళ్లారు. చండీఘడ్‌లో సాగు చట్టాల ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలు, అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో త్వరలో సంచలనాలు జరుగుతాయన్నారు. పంజాబ్‌ టూర్ తర్వాత సీఎం కేసీఆర్ మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించాల్సి ఉంది. ఐతే అనివార్య కారణాలతో ఇటీవల సీఎం కేసీఆర్ ..హైదరాబాద్ చేరుకున్నారు. తాజాగా బెంగళూరులో మంతనాలు జరిపారు. గతకొంతకాలంగా బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్ మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఇరుపార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. 


 


Also read:KGF Chapter 2 Collections: బాక్సాఫీస్‌పై రాకీ భాయ్ దండయాత్ర.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ ఎంతో తెలుసా?


Also read:Revanth Reddy Letter: బీజేపీ, టీఆర్ఎస్‌ ఒక్కటే..మోదీకి రేవంత్‌రెడ్డి లేఖాస్త్రం..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి