KCR National Tour: జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన సీఎం కేసీఆర్ సుదీర్ఘ దేశవ్యాప్త పర్యటన చేస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌యాదవ్‌తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌తో భేటీ అయ్యారు. నేషనల్ పాలిటిక్స్‌పై కీలకచర్చలు జరిపారు. ఢిల్లీలో స్కూళ్లు, గవర్నమెంట్ హాస్పిటళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రివాల్‌ను ఆకట్టుకునే ప్రయత్నంచేశారు. ఇక అటునుంచి పంజాబ్ వెళ్లిన సీఎం కేసీఆర్ రైతుఉద్యమంలో అసువులుబాసిన రైతుకుటుంబాలకు చెక్కులు అందించారు. పంజాబ్, హర్యానాకు చెందిన 693 మందికి మూడులక్షల చొప్పున ఆర్థికసాయం అందించారు. ఈ సందర్భంగా కేంద్రప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. మోడీ సర్కార్ అన్నదాతల రక్తం తాగుతోందన్నారు. రైతుకు విరోధులుగా మారిన వారిని దింపేద్దామని పిలుపునిచ్చారు. ఢిల్లీ, పంజాబ్ తర్వాత కర్నాటక, మహారాష్ట్రలోనూ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. షార్ట్ గ్యాప్ తీసుకొని ఈ నెల 29,30 వ తేదీలో బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు వెళ్తున్నారు కేసీఆర్. అక్కడ పలువురు రాజకీయ నేతలతో భేటీ కానున్నారు.
జాతీయ పర్యటనపై కేసీఆర్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. జాతీయ స్థాయిలో తన బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా టూర్ ప్లాన్ చేశారు. తాను రైతుపక్షపాతినని చెప్పుకునేందుకు రైతుఉద్యమంలో చనిపోయిన అన్నదాతలకు ఆర్థికసాయం అందించారు. కేసీఆర్ కోణంలో ఆయన పొలిటికల్ ప్లాన్ కరెక్టే అయినా... తెలంగాణ జనంలో మాత్రం కేసీఆర్ జాతీయపర్యటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నోసమస్యలు పెట్టుకొని ఈ సమయంలో కేసీఆర్ జాతీయ పర్యటన అవసరమా అని ప్రశ్నిస్తున్నారు రైతులు. ఇప్పటికీ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు పూర్తికాలేదు. వర్షాలతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుణమాఫీ కాక రైతులకు బ్యాంకర్లు కొత్త రుణాలు ఇవ్వడంలేదు. అప్పుడూ , ఇప్పుడూ అనడమేకానీ ఇప్పటికీ రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన విధానం అమలుచేయలేకపోతోంది. ఆర్థిక ఇబ్బందులతో రాష్ట్రంలోనై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారిని ఏనాడూ అధికార పార్టీ నేతలు కనీసం పరామర్శించలేదు. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న రైతులకు సాయం చేయని కేసీఆర్.. ఎక్కడో పంజాబ్‌లో ఉన్న రైతులకు సాయం చేయడమేంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు రైతులు. తెలంగాణ పల్లెల్లో కేసీఆర్ ఢిల్లీ పర్యటన వ్యతిరేకతను పెంచుతున్నట్లు టీఆర్ఎస్ పార్టీ నేతలే చెబుతున్నారు. కేసీఆర్ జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పాలనుకోవడం సరైందే అయినా.. ఎంచుకున్న మార్గం మాత్రం కరెక్ట్ కాదేమోనని గులాబీ పార్టీ నేతలు లోలోన మదనపడుతున్నారు.
కేసీఆర్ ఢిల్లీ టూర్‌పై విపక్షాలు సైతం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. ఇక్కడ సమస్యలను పరిష్కరించే దమ్ములేకే కేసీఆర్ పారిపోయాడని విమర్శిస్తున్నాయి. అటు మోడీకి మొహం చూయించలేకే.. ప్రధాని తెలంగాణ పర్యటన ముందు కేసీఆర్ అకస్మాత్తు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నాడని బీజేపీ ఫైరవుతోంది. ఈ విమర్శలు తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. పలువురు రాజకీయ విశ్లేషకులు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నవారు కూడా ఈ అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారు. ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని చల్లార్చకుంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కష్టకాలం ఎదురయ్యే పరిస్థితి కూడా ఉందంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలను , వారి ఆలోచనాతీరును ఆమూలాంతం చదివిన కేసీఆర్ కు వారిని తనవైపు ఎలా తిప్పుకోవాలో బాగా తెలుసని ఆయన అభిమానులు ఘంటాపథంగా చెబుతున్నారు.
Also read : Errabelli On Sarpanch: సర్పంచులు రోడ్లమీదకు రావొద్దు, పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం..!
Also read : Gaddar Meet Amit sha: అమిత్ షాను గద్దర్ ఎందుకు కలిశారు? బీజేపీ సభలో అసలేం జరిగింది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి